మన్యం న్యూస్,ఇల్లందు:భద్రాద్రి జిల్లా ఆదివాసీ జేఏసీ చైర్మన్ పెండెకట్ల యాకయ్య దొర ఏ పార్టీలో చేరతారనే ఉత్కంఠకు తెరపడింది. ములుగు ఎమ్మెల్యే సీతక్కకు బంధువు, అత్యంత సన్నిహితుడిగా పేరున్న యాకయ్య ములుగు జిల్లాలోని గంగారంలో సోమవారం అర్థరాత్రి సీతక్క సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ మేరకు పత్రికా ప్రకటన విడుదల చేసిన యాకయ్య మాట్లాడుతూ..ఆదివాసీ ముద్దుబిడ్డ సీతక్క ఆహ్వానం మేరకు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందని తెలిపారు. రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరాలని పలువురు కోరినప్పటికీ నాకు ఇష్టమైన సీతక్క సమక్షంలో హస్తం పార్టీలో చేరడం చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రస్తుతం ఆదివాసి ముద్దుబిడ్డ డాక్టర్ సీతక్క గెలుపుకై కృషిచేస్తానని యాకయ్య పేర్కొన్నారు.