మన్యం న్యూస్ అశ్వాపురం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం లో గల గ్రామపంచాయతీలలో విస్తృతంగా కారు ప్రచారం జరుగుతుంది.మండల వ్యాప్తంగా మండల నాయకులు యువజన నాయకులు గ్రామ శాఖ అధ్యక్షులు కార్యకర్తలు అభిమానులు అందరూ కలిసి గ్రామాలలో బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి రేగా కాంతారావు గెలుపే లక్ష్యంగా ప్రచారం కొనసాగిస్తున్నారు.మేనిఫెస్టోను వివరిస్తూ ప్రజలందరినీ కారు గుర్తుకు ఓటు వేయాలని రేగా కాంతారావు అని భారీ మెజారిటీతో గెలిపించుకొని అశ్వాపురం మండలాన్ని మరింత అభివృద్ధి చేసుకోవాలని కోరుతున్నారు.రేగా కాంతారావు చేసిన అభివృద్ధి మండల ప్రజలకు కొండంత అండ అని నూతన సీసీ రోడ్ల నిర్మాణం,బీటీ రోడ్ల నిర్మాణం,పాలిటెక్నిక్ కాలేజ్,డిగ్రీ కళాశాల,నవోదయ సైనిక్ స్కూల్,అశ్వాపురం, మొండికుంట గ్రామపంచాయతీలలో సైడ్ డ్రైనేజీలా నిర్మాణం, కూ గ్రామాలకు సైతం బీటీ రోడ్ల నిర్మాణం,త్రీఫేస్ కరెంట్ లైన్లు,రేగా విష్ణు ట్రస్ట్ ఆధ్వర్యంలో ముసలివారికి కంటి ఆపరేషన్లు,రేగా విష్ణు ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారికి ఆర్థిక సహాయం,కరోనా కష్టకాలంలో ప్రజలకు నిత్యవసర సరుకుల పంపిణీ,వరదల సమయంలో దగ్గరుండి సహాయక చర్యలు ఆర్థిక సాయం,ఇలా చెప్పుకుంటూ పోతే మరెన్నో సంక్షేమ పథకాలు కళ్యాణ లక్ష్మి ,షాది ముబారక్ ,రైతుబంధు,రైతు బీమా,దళిత బందు,బీసీ బంధు రేగాగు కొండంత అండని ఇస్తున్నాయని మండల ప్రజానీకం తెలియజేశారు.ఇదిలా ఉండగా మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రతి గ్రామ పంచాయితీలో బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోను ప్రజలకు ఇంటి వద్దకు వెళ్లి విస్తృతంగా వివరిస్తున్నారు.మండల వ్యాప్తంగా జోరుగా ప్రచారాలు , కారు గుర్తుకే మన ఓటు నినాదాలతో మారి మోగిపోతున్న పల్లెలు వాడలు పట్టణాలు,మండల అధ్యక్షులు,యువజన విభాగం అధ్యక్షులు,కార్యకర్తలు అభిమానులు సోషల్ మీడియా సభ్యులు రేగా కాంతారావు ని భారీ మెజారిటీతో గెలిపించుకొని అశ్వాపురం మండలాన్ని ఎనలేని విధంగా అభివృద్ధి చేసుకోవాలని కంకణం కట్టుకున్నారు.అదే బాటలో రేగా గెలుపు కోసం విస్తృతంగా అన్ని గ్రామ పంచాయతీలలో జోరుగా ప్రచారాలు కొనసాగుతున్న మండల ప్రజానీకం రేగాకే మా మద్దతు అని తెలియజేస్తున్నారు.