మూడోసారి కేసీఆర్ సీఎం కావడం ఖాయం
* ఎన్నికల ప్రచారంలో అభ్యర్థి వనమా
మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో అందిస్తున్న ప్రతి ఇంటికో పథకమే తిరిగి తనను ఈ ఎన్నికల్లో గెలిపిస్తుందని కొత్తగూడెం శాసనసభ్యులు,
బిఆర్ ఎస్ అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావు అన్నారు. మంగళవారం లక్ష్మీదేవిపల్లి మండలంలోని అనిశెట్టిపల్లి, లాల్ తండా, సీతారాంపురం, కొత్తూరు, బావోజీ తండా, గట్టుమళ్ల, మున్యా తండా, దుడియా తండా, పెద్దతండ, రేగళ్ల ప్రాంతాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన విస్తృతంగా పర్యటించి ప్రసంగించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ రాష్ట్రంలో అమలు చేయని విధంగా తెలంగాణలో ప్రతి కుటుంబానికి ఒక పథకం అందే విధంగా రూపకల్పన చేసి అమలుపరుస్తున్నారని చెప్పారు. ప్రజలు ఈ పథకాల విషయంలో సంతృప్తిగా ఉన్నారని ప్రభుత్వ పథకాలే బీఆర్ఎస్ ప్రభుత్వానికి మళ్లీ అండగా నిలుస్తాయని ఆయన అన్నారు. ప్రతి ఇంటికో పథకం ద్వారా ప్రజల్లో కేసీఆర్ పై అపార నమ్మకం కలిగిందని తెలిపారు. ఎన్నికల సమయంలో ప్రత్యక్షమై మాటలు చెప్పే నాయకుల నమ్మొద్దు అని ఎన్నికల్లో తప్పనిసరిగా వారికి ప్రజలు గుణపాఠం చెప్పాలని వనమా వెంకటేశ్వరరావు అన్నారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ఎడవల్లి కృష్ణ, కోనేరు సత్యనారాయణ చిన్ని, నాయకులు కార్యకర్తలు వనమా అభిమానులు పాల్గొన్నారు.