UPDATES  

 బీఆర్ఎస్ జోరుప్రచారం..

  • బీఆర్ఎస్ జోరుప్రచారం
  • 33 ఓటర్లు ఉన్న దొంగతోగు గ్రామాన్ని పంచాయతీగా ప్రకటించిన ఘనత సీఎం కేసీఆర్ దే
  • ఎంపీపీ మంజు భార్గవి

మన్యం న్యూస్ గుండాల: తండాలను గూడాలను పంచాయతీలుగా చేసిన ఘనత కెసిఆర్ ప్రభుత్వానికి దక్కుతుందని ఎంపీపీ కొండ్రు మంజు భార్గవి అన్నారు.ఆమె మంగళవారం మండల పరిధిలోని

పలు గ్రామాలలో ప్రభుత్వ విప్ పినపాక నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రేగా కాంతారావు గెలుపు కాంక్షిస్తూ విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 33 ఓటర్లు ఉన్న దొంగ తోగు ను పంచాయతీగా ప్రకటించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కి దక్కుతుందన్నారు. ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ప్రత్యేకత కిన్నెరసాని వాగుపై వంతెనతో పాటు రహదారి సౌకర్యాన్ని కల్పించారని మిషన్ భగీరథ ద్వారా తాగునీరు సౌకర్యాన్ని కల్పించారని గ్రామానికి త్రీఫేస్ విద్యుత్ కూడా ఇచ్చినట్లు పార్టీ నాయకులు పేర్కొన్నారు. అభివృద్ధికి తోడుగా నిలుస్తున్న రేగా కాంతారావుకు అండగా నిలిచి అఖండ మెజార్టీతో గెలిపించి అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గుండాల ఆళ్లపల్లి మండలాల నాయకులు గుండాల మండల అధ్యక్షులు తెల్లం భాస్కర్, ఆళ్లపల్లి మండల పార్టీ ప్రధాన కార్యదర్శి బాబా,ఎంపీపీ మంజు భార్గవి, పిఎసిఎస్ చైర్మన్ రామయ్య, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు వీరస్వామి, సర్పంచ్ కొమరం బాయమ్మ, శంకర్ బాబు, ఉప సర్పంచ్ బచ్చల పాపారావు, యువజన విభాగం అధ్యక్షులు అజ్జు, ఎస్సీ సెల్ అధ్యక్షులు రాములు, బీసీ సెల్ అధ్యక్షులు రమేష్, పార్టీ ప్రధాన కార్యదర్శి కయ్యుo, తిరు కొల్లూరి రాము,ప్రవీణ్, గడ్డం వీరన్న, కృష్ణ, సోషల్ మీడియా అధ్యక్షులు ఆరిఫ్, గుర్రం రాములు, రెండు మండలాల పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !