UPDATES  

 పోదెం వీరయ్యను గెలిపించండి… కెసిఆర్ కు బుద్ధి చెప్పండి..

  • పోదెం వీరయ్యను గెలిపించండి… కెసిఆర్ కు బుద్ధి చెప్పండి
  • విద్యార్థుల ఆత్మహత్యల బలిదానాలపై కేసీఆర్ రాజ్యమేలుతున్నాడు……. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

 

మన్యం న్యూస్ చర్ల:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో భద్రాచలం నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి పోదెం వీరయ్య విజయాన్ని కాంక్షిస్తూ ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ లెజెండ్స్ తుమ్మల నాగేశ్వరరావు, పొంగేడు శ్రీనివాసరావు ఎన్నికల ప్రచార రోడ్ షో కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉవ్వెత్తున ఎగసిపడుతోందని, ఇక తమను ఆపే ప్రసక్తే లేదని మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావులు ధీమా వ్యక్తం చేశారు. ఈ రోడ్డు షోలో భద్రాచలం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పొదెం వీరయ్యను గెలిపించాలని కోరుతూ… మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ బాలస్వామి లక్ష్మీనారాయణలు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీలు రెండింటికి ఒకదానితో ఒకటి మంచి దోస్తాన ఉందని, వీరి మధ్య ఫెవికాల్ బంధం ఉందని, “నువ్వు కొట్టినట్లు చెయ్యి…. నేను ఏడ్చినట్లు చేస్తానని ప్రజలను నమ్మబలికే విధంగా డ్రామాలాడుతున్నారని, వీరి మాయ మాటల్లో పడోద్దని, ఈ రెండు పార్టీ ల ఉద్దేశ్యం ఒక్కటేనని సూచించారు. కేవలం స్వలాభం కోసం, ఆస్తులు, అంతస్తులు పెంచుకోవడం కోసమే తెలంగాణ తెచ్చుకున్నట్లు ఉన్నది కానీ తెలంగాణ ప్రజలకు ఒరిగిందేమీ లేదని విమర్శించారు. ఆనాడు అనేక మంది ఉద్యమాలు చేశారని, మేధావులు, సుమారు 1300 మంది యువత ఆత్మహత్యలు చేసుకున్నారని అలాంటి వారి పునాదుల పై కేసీఆర్ రాజ్యమేలడానికి సిగ్గు కూడా లేదా అని ఘాటుగా వ్యాఖ్యానించారు. నిరుద్యోగ యువతను మర్చిపోయారని, టీఎస్పీఎస్ ఎగ్జామ్స్ పెట్టామని చెబుకుంటున్న కేసీఆర్ ఆ పరీక్ష పేపర్ ను జిరాక్స్ సెంటర్లలో కోట్లాది రూపాయలకు కక్కుర్తి పడి కేబినెట్ మంత్రులు అమ్ముకున్న సంగతి అందరికీ తెలిసిందేనన్నారు. నిరుద్యోగ యువతను నడి రోడ్డు పై నిలబెట్టిన ఘన చరిత్ర ఉన్న ఈ కేసీఆర్ కు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందన్నారు. సీపీఐ, షర్మిలమ్మ, కోదండ రామ్ పార్టీల నాయకులకు వందనాలు తెలుపుకున్నారు. ఈ బహిరంగ సమావేశానికి వేలల్లో కాంగ్రెస్, సిపిఐ, టిడిపి నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !