మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
ఈనెల 21 నుండి 22 తేదీలలోగా దివ్యాంగులు, 80 సంవత్సరాలు పైబడిన
వయోవృద్దులకు ఇంటి నుండి ఓటుహక్కు వినియోగానికి అవకాశం కల్పించగా మంగళవారం వరకు 268 మంది ఓటుహక్కు వినియోగించుకున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల తెలిపారు. జిల్లాలో 241 మంది దివ్యాంగులు, 484 మంది 80 సంవత్సరాలు పైబడిన వయోవృద్దులు, 41 మంది అత్యవసర సేవల సిబ్బంది మొత్తం 766 మందికి ఫారం 12 డి ద్వారా హోం ఓటింగ్ కు అవకాశం కల్పించినట్లు చెప్పారు. పినపాకలో 54 మంది దివ్యాంగులు, వయోవృద్దులు 54 మందికి, ఇల్లందులో 35 మంది దివ్యాంగులు,
వయోవృద్దులు 108లకు, కొత్తగూడెంలో
52 మంది దివ్యాంగులకు,
వయోవృద్దులు 110 మందికి, అశ్వారావుపేటలో 48 మంది దివ్యాంగులకు,
వయోవృద్దులు 126 మందికి, భద్రాచలంలో
52 మంది దివ్యాంగులకు,
వయోవృద్దులు 86 మందికి, 41 మంది అత్యవసర సేవల సిబ్బందికి హోం ఓటింగ్ ద్వారా ఓటుహక్కు వినియోగించుకోనున్నట్లు ఆమె చెప్పారు. వీరందరికీ ఈ నెల 21 నుండి 22వ తేదీల్లో ఎన్నికల సంగం నియమాల మేరకు ఇంటింటికీ వెళ్లి పోస్టల్ బ్యాలెట్ ద్వారా పటిష్ట బందోబస్తు, వీడియో గ్రఫీ నడుమ ఓటుహక్కు వినియోగానికి చర్యలు తీసుకునున్నట్లు చెప్పారు. హోం ఓటింగ్ సమాచారాన్ని అన్ని రాజకీయ పార్టీలకు అందించినట్లు ఆమె పేర్కొన్నారు. ఇంటి నుండి ఓటు హక్కు వినియోగానికి ఎన్నికల సంఘ నియమ నిబంధనలు మేరకు షెడ్యూల్ తయారు చేశామని ఆ ప్రకారం హోం ఓటింగ్ నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల స్పష్టం చేశారు.