మన్యం న్యూస్ చర్ల:
చర్ల మండల పరిధిలోని విజయకాలనీ కి చెందిన అనాథ నాయిని అనిల్ కు చిన్న వయసులోనే క్షయ వ్యాధి సోకడం, సరైన వైద్యం అందక కిడ్నీలు డ్యామేజ్ కావఢం జరిగింది. తోడుగా ఉన్న సోదరి దినసరి కూలీ కావడం వల్ల వైద్య ఖర్చులకు కష్టంగా ఉండడంతో, మీకోసం మేమున్నాం టీం ముందుకొచ్చి పలువురి దాతల సహకారంతో… మంగళవారం చర్ల లోని మేమున్నాం కార్యాలయంలో 17,500 /- ఆర్థిక సహాయమును కేసరి శ్రావణి మరియు తోటపల్లి మాధవరావు ల చేతుల మీదుగా వారి కుటుంబ సభ్యులకు వితరణగా అందజేయడం జరిగింది. నాయిని అనిల్ ఆరోగ్యం త్వరగా కుదుటపడాలని, వారి కుటుంబం ఆర్థికంగా నిలబడాలని చైర్మన్ లయన్ నీలి ప్రకాష్ ఆకాంక్షించారు.. ఈ కార్యక్రమంలో జవ్వాది సతీష్,రంగు వెంకట్, ఎంవీయస్ యన్ చారి, మామిడి సతీష్, బీవీ ప్రతాప్, చింతలపూడి లక్ష్మీ, దొడ్డి రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.