మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం టౌన్:
ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్, సిపిఎం, టీజేఎస్, ప్రజాపంతా బలపరిచిన సిపిఐ అభ్యర్థి కూనంనేని సాంబశివరావు సుజాతనగర్ మండలంలోని అంజనాపురం కొత్త అంజనపురం పలు గ్రామపంచాయతీలలో మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి గ్రామంలో మహిళలు యువకులు వృద్ధులు నీరాజనాలు పట్టారు. ప్రచారంలో సిపిఐ అభ్యర్థి కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ సుజాతనగర్ మండల ప్రజలు నన్ను ఎంతగానో ఆప్యాయంగా ఆదరించారని అన్నారు. కొత్తగూడెం నియోజకవర్గ ప్రజలకు తాను సుపరిచితుని పేదల బడుగుల అభ్యున్నతి కొరకు ఎన్నో రకాల ప్రజా సమస్యలపై పోరాటాలు చేసామన్నారు. ప్రతి గ్రామంలోని ప్రతి గడప తనకు తెలుసని అన్నారు. ఎవరో వస్తారు ఏదో చెబుతారు మళ్ళీ కానరారు కానీ నేను మీ వాన్ని ఈ ప్రాంత నివాసిని మీ కష్టసుఖాల్లో మీ అండగా ఉండే నాయకున్ని, గతంలో నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తులు నియోజకవర్గం ప్రజల అభివృద్ధి కొరకు చేసింది ఏమీ లేదని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్న సమయంలో 2009 నుండి 2014 వరకు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రభుత్వ అధికారులతో మాట్లాడి తీసుకువచ్చిన నిధుల నుండి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టానన్నారు. నాటి అభివృద్ధిపనులను నేటి వరకు కొనసాగించి వాటిని మేమే తీసుకువచ్చామని చెప్పుకోవడం సిగ్గుచేటు అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు నాగ సీతారాములు, టిడిపి, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, ప్రజాపంత, నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.