మన్యం న్యూస్ కరకగూడెం:చిరుమళ్ళ ఆశ్రమ పాఠశాలను ఆకస్మికతనికే చేసిన భద్రాచలం ఐటిడిఏ డిడి మనెమ్మ మంగళవారం ఆకస్మిక తనికి నిర్వహించారు.అనంతరం విద్యార్థులకు అందించే భోజనం,స్టోర్ రూమ్,రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు.ఈ సందర్భంగా అమె మాట్లాడుతూ పదవ తరగతి విద్యార్థులను ఇంగ్లీషు, గణితం,సైన్స్ సబ్జెక్టులను పరిశీలించారు. అలాగె ఉపాధ్యాయులతో సమావేశం ఎర్పాటు చేసి ప్రాధమిక స్థాయి నుండి ఇతరుల విద్యార్థులకు గుణాత్మకమైన విద్యను అందించి వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక భోదన అందించాలని పదో తరగతి విద్యార్థులు నూరు శాతం పాసు అయ్యేవిధంగా కృషి చేయాలని చూపించారు. లేనియెడల సంబంధిత ఉపాధ్యాయులపై చర్యలు తప్పవని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.