మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలన చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల తెలిపారు. మంగళవారం ఐడిఓసి కార్యాలయంలో ఏర్పాటు చేసిన వెబ్ కాస్టింగ్ ద్వారా చెక్ పోస్టుల వద్ద
వాహనాలు తనిఖి, బారికేడింగ్, సిబ్బంది విధుల నిర్వహణ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో భాగంగా జిల్లాలోని అంతరాష్ట్ర సరిహద్దుల్లో పటిష్ట
తనిఖీలు నిర్వహణకు 15 చెక్ పోస్టులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అన్ని చెక్ పోస్ట్ లలో 24 గంటలు తనిఖీలు
నిర్వహణకు షిఫ్టులు వారిగా మూడు టీములు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రతి టీములో పోలీస్, సూపరింటెండ్,
మండల వ్యవసాయ అధికారులతో టీములు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. విధుల నిర్వహణలో సిబ్బంది తప్పక
అందుబాటులో ఉండాలని చెప్పారు. చెక్ పోస్టులు వద్ద వాహనాల వేగాన్ని నియంత్రణ చేసేందుకు బారికేడింగ్
ఏర్పాటు చేయాలని చెప్పారు. ప్రతి వాహనాన్ని నిశిత పరిశీలన చేయాలని, పరిశీలన సమయంలో వీడియో
గ్రఫి చేయాలని చెప్పారు. అశ్వారావుపేట, కొత్తగూడెం నియోజకవర్గ పరిధిలోని ఇల్లందు క్రాస్ రోడ్డు,
అశ్వారావుపేట రాష్ట్ర సరిహద్దులో ఏర్పాటు చేసిన చెకోపోస్టులు వద్ద వాహన తనిఖీలు నిర్వహణపై సిబ్బందికి
పలు సూచనలు చేశారు. వాహన తనిఖీలపై సంబంధిత రిటర్నింగ్ అధికారులతో ఫోన్లో మాట్లాడిన ఆమె
మూడు షిఫ్టుల్లో సిబ్బంది విధుల్లో అందుబాటులో ఉండాలని, ప్రతి వాహనాన్ని నిశిత పరిశీలన చేయడంతో
పాటు పటిష్ట పర్యవేక్షణ చేయాలని చెప్పారు.
రిటర్నింగ్ అధికారులు వారి పరిధిలో ఏర్పాటు చేసిన చెక్ పోస్టులు తనిఖీ చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో వెబ్ కాస్టింగ్
నోడల్ అధికారి సులోచనారాణి తదితరులు పాల్గొన్నారు.