- ఎర్ర మట్టి సంపద లూటి!
- ఏకమైన తోడు దొంగలు
- ప్రతిరోజు ట్రాక్టర్ల ద్వారా తరలింపు
- ఫిర్యాదు చేసిన స్థానికులు
- రంగంలోకి దిగిన అటవీశాఖ అధికారులు
- జెసిబి వాహనం స్వాధీనం
- అటవీ సంపద దోచుకుంటే చర్యలు
మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గ పరిధిలోని ఉన్న అన్నపురెడ్డిపల్లి శివారు ప్రాంతంలోని అటవీ భూమి నుండి కొందరు అక్రమార్కులు తోడై ఎర్రమట్టిని లూటీ చేస్తున్నారు. ఈ తతంగం గత కొద్ది రోజులుగా నడుస్తున్నప్పటికీ చర్యలు తీసుకునే నాధుడే కరువయ్యాడు. ఈ మట్టి దొంగలకు ఒక పెద్ద పత్రిక విలేఖరి తోడై వారికి అండగా నిలుస్తూ అటవీ సంపదను దోచుకెళ్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. అటవీ శాఖ నిబంధనలకు విరుద్ధంగా సంపదను తోడేయడంతో అటవీ అందాలను ఆస్వాదించేవారు కలవర పడుతున్నారు. ఆర్ఓఎఫ్ఆర్(రికగ్నేషన్
ఆఫ్ ఫారెస్ట్ రైట్స్)భూమిలో యుదేచ్ఛగా ఎర్ర మట్టిని తరలించుకోవడాన్ని చూసిన కొందరు అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది. వారి వెంటనే స్పందించి మంగళవారం రంగంలోకి దిగి చర్యలు చేపట్టారు. జెసిబి వాహనంతో మట్టిని తవ్వుతున్న దాన్ని గమనించి అట్టి జెసిబి వాహనాన్ని ఫారెస్ట్ వారు స్వాధీనం చేసుకొని కార్యాలయానికి తరలించారు.
*సంపదను దోచుకుంటే చర్యలు తప్పవు…*
అటవీ శాఖ పరిధిలో ఉన్న భూమిలో నుండి ఎర్రమట్టిని అక్రమంగా తరలించకపోవడం చెట్లను నరికివేసే కార్యక్రమాన్ని నిర్వహిస్తే చర్యలు తప్పవని అటవీ శాఖ చండ్రుగొండ రేంజర్ సిహెచ్ ఎల్లయ్య అన్నారు.
అటవీశాఖ నిబంధనలు ఉల్లంఘిస్తే ఎవరినైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.