మన్యం న్యూస్ మణుగూరు:
మణుగూరు మండలం లోని ముత్యాలమ్మ నగర్ గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షులు మదార్ హుస్సేన్ ఆధ్వర్యంలో సింగరేణి రిటైర్డ్ కార్మికుల సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా బిఅర్ఎస్ నాయకులు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అన్ని రంగాలలో అభివృద్ధి చెందడం జరిగిందన్నారు. సంక్షేమ పథకాలతో బడుగు బలహీన వర్గాలకు సీఎం కేసీఆర్ అండగా నిలిచారన్నారు.పినపాక నియోజకవర్గం లో రేగా కాంతారావు అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేశారన్నారు.అనేక సంక్షేమ పథకాలను అందిస్తూ సాగునీరు,తాగునీరు,విద్య, వైద్య,రవాణా,కరెంటు వంటి సదుపాయాలు అందించారని తెలియజేశారు.రానున్న ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ కారు గుర్తుపై ఓటు వేసి ప్రభుత్వ విప్ రేగా కాంతారావు భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమం లో సర్పంచ్ జంపేశ్వరి,కార్మిక సంఘాల అధ్యక్షులు కత్తి రాము, సీనియర్ నాయకులు ఎస్కే మౌలానా సింగరేణి రిటైర్డ్ కార్మిక సంఘాల నాయకులు గంగపురి నారాయణ,పాయం నరసింహారావు,సీనియర్ సూపర్వైజర్లు మెరుగు. ఈశ్వరయ్య,సత్యనారాయణ,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.