- అభివృద్ధి చేశాం… ఆశీర్వదించండి
- దత్తత గ్రామంగా చింతల బయ్యారం
- ఈ నెల 30న కారు గుర్తుపై ఓటు వేయాలని అభ్యర్థన
- పినపాక నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి రేగా కాంతారావు
- రేగాకు బ్రహ్మరథం పట్టిన ప్రజలు,బీ ఆర్ ఎస్ పార్టీ శ్రేణులు
- బీ ఆర్ ఏస్ శ్రేణుల భారీ బైక్ ర్యాలీ
మన్యం న్యూస్ ,పినపాక: కాంగ్రెస్ పార్టీని నమ్మి మోసపోవద్దని ప్రభుత్వ విప్, పినపాక నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రేగా కాంతారావు ప్రజలను కోరారు. ఆయన మండలంలో విస్తృతంగా పర్యటించి ఈనెల 30న జరగనున్న అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుపై ఓటు వేయాలని ఓటర్ మహాశయులను అభ్యర్థించారు. రేగా కాంతారావు నిర్వహించిన రోడ్డు షోలకు ప్రజలు పార్టీ శ్రేణులు బ్రహ్మరథం పట్టారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ
ప్రజల అభివృద్ధి, సంక్షేమమే బీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ ప్రభుత్వ విప్, బీఆర్ఎస్ పార్టీ పినపాక నియోజకవర్గం అభ్యర్థి రేగా కాంతారావు అన్నారు. మంగళవారం పినపాక మండలం సీతారాంపురం, పోట్లపల్లి, గడ్డంపల్లి, జానంపేట, చెగర్షల గ్రామపంచాయతీలలో ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ముందుగా సీతారాంపురం గ్రామం వద్ద గ్రామ దేవతలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణ ప్రజల ఉజ్వల భవిష్యత్‌ను తీర్చిదిద్దే విధంగా సీఎం కేసీఆర్ మేనిఫెస్టో రూపొందించారని ఆయన అన్నారు. ప్రజల ఆశీర్వాదంతో ముచ్చటగా మూడోసారి విజయ ఢంకా మోగించడం తద్యమన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు సతీష్ రెడ్డి,ఎంపీపీ.గుమ్మడి గాంధీ,జడ్పిటిసి దాట్ల సుభద్ర దేవి వాసు బాబు, ఆత్మ కమిటీ చైర్మన్ భద్రయ్య, సహకార సంఘ చైర్మన్ రవి శేఖర్ వర్మ, కిషోర్ ,బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.