మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం టౌన్:
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 నియోజకవర్గాలలో పోటీల్లో ఉన్న బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకోవాలని బిఆర్ఎస్ రాష్ట్ర మాజీ కార్యవర్గ సభ్యులు
మోరే భాస్కరరావు నాయకులకు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మంగళవారం జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పదికి పది గెలిపించుకొని భారత రాష్ట్ర సమితి వ్యవస్థాపకులు కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు కానుకగా ఇవ్వాలని అన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగిందన్నారు. సీఎం కేసీఆర్ పాలనను ప్రతి ఒక్కరు మెచ్చుకుంటున్నారని అందుకే అనేకమంది గులాబి పార్టీలోకి రావడం జరుగుతుందని పేర్కొన్నారు. బీసీ ఎస్టీ ఎస్సీ మైనార్టీ ఓసి క్యాస్ట్ వారంతా గులాబీ అభ్యర్థుల గెలుపుకు కృషి చేస్తూ వారికి కారు గుర్తుపై ఓట్లు వేసి అత్యధిక మెజార్టీ తెప్పించాలన్నారు. భారత రాష్ట్ర సమితి ప్రవేశపెట్టిన మేనిఫెస్టో అందరికీ న్యాయం జరిగే విధంగా ఉందన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే హామీలన్నీ తూచా తప్పకుండా అమలు చేసే బాధ్యత కేసీఆర్ తీసుకుంటారని మోరే భాస్కర్ తెలిపారు. సమావేశంలో భారత రాష్ట్ర సమితి నాయకులు పాల్గొన్నారు.