UPDATES  

 వెన్నుపోటు దారుడు వనమా..

  • వెన్నుపోటు దారుడు వనమా
  • కొడుకు రాఘవ అవినీతి రాక్షసుడు
  • ధరణితో భూములను లాక్కున్న కేసీఆర్
  •  కాంగ్రెస్ పాలన ప్రజలకు శ్రీరామరక్ష
  •  సాంబశివరావును అధిక మెజార్టీతో గెలిపించండి
  •  కొత్తగూడెం అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యం
  •  రోడ్ షోలో మాజీ మంత్రి రేణుక చౌదరి

 

మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:

కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచిన వనమా వెంకటేశ్వరరావు గులాబీ దండు ప్రవేశపెట్టిన ప్యాకేజీ ఆఫర్ కు ఆశపడి బీఆర్ఎస్ పార్టీలో చేరి ఆస్తులను కూడగట్టుకున్నాడని సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు మాజీ మంత్రి రేణుక చౌదరి ఫైర్ అయ్యారు. అలాంటి వనమా వెంకటేశ్వరరావుకు ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పి కాంగ్రెస్ తో పాటు ఇతర పార్టీలు బలపరుస్తున్న సిపిఐ అభ్యర్థిని కూనంనేని సాంబశివరావును గెలిపించాలని రేణుక చౌదరి విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కొత్తగూడెం పట్టణంలోని పలు వార్డుల్లో సిపిఐ అభ్యర్థి విజయాన్ని కాంక్షిస్తూ బుధవారం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. కాంగ్రెస్, టిడిపి, సిపిఎం, సిపిఐ ఎంఎల్, టీజేఎస్, వైయస్సార్ టిపిలు బలపరిచిన సిపిఐ అభ్యర్థి కూనంనేని సాంబశివరావు కంకి కొడవలి గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. పట్టణంలోని పెద్ద బజార్ నందు నిర్వహించిన రోడ్ షోలో మాజీ కేంద్రమంత్రి రేణుకా చౌదరి మాట్లాడుతూ వెన్నుపోటు దారుడుగా పేరొందిన వనమాను ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని కోరారు. వనమా కొడుకు రాఘవ అవినీతి రాక్షసుడుగా మారడంతో పాటుగా కుటుంబాలను కూలుస్తూ రాక్షస ఆనందాన్ని పొందుతున్న వనమా కుటుంబాన్ని ఇంటికే పరిమితం చేయాలని పిలుపునిచ్చారు. మరో వ్యక్తి సింహంలా జూలు విరుచుకుంటూ ప్రజలపై అనేక దండయాత్రలు చేసిన సంఘటన 2014 నుండి 18 వరకు చూసామన్నారు. ఈ వ్యక్తిని సైతం ప్రజలు ఆదరించకుండా నిత్యం ప్రజల మధ్య ఉండే కూనంనేని సాంబశివరావును అత్యధిక మెజారిటీతో గెలిపించి అసెంబ్లీకి పంపాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బిక్కసాని నాగేశ్వరరావు,

నాగ సీతారాములు, ఆంతోటి పాల్, తోట దేవి ప్రసన్న, శంకర్ నాయక్, సిపిఐ పార్టీ సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాష, ఏఐటియుసి నాయకులు గెద్దాడ నాగేశ్వరరావు, మాజీ ఎంపీపీ సలిగంటి శ్రీనివాసరావు, హామాలి సంఘం నాయకులు శ్రీనివాస్ రెడ్డి, తరాల రాజు, మల్లయ్య, దళిత సంఘాల నాయకులు కూసపాటి శ్రీను, బొంకూరి పరమేష్, మంద హనుమంతు, అధిక సంఖ్యలో మహిళలు కార్యకర్తలు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !