- అభివృద్ధి జరగాలంటే …మళ్ళీ కాంతన్నే రావాలి
- రేగా…రేగా…రేగా
- బీ ఆర్ ఎస్ అభ్యర్థి కాంతన్నకు బ్రహ్మరథం పట్టిన అశ్వాపురం మండల ప్రజలు
- అభివృద్ధి ప్రదాతపై పూల వర్షం కురిపించిన సోదరీమణులు
- గ్రామ గ్రామాన మంగళ హారతులతో ఆడపడుచులఆశీర్వాదం
మన్యం న్యూస్,పినపాక: పిరపాక నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రేగా కాంతారావు ప్రచారం మొదలు పెట్టిన నాటి నుండి నియోజకవర్గంలోని ఏ మండలానికి వెళ్లిన సోదరీమణులు ,బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, యువకులు బ్రహ్మరథం పడుతున్నారు. రేగా.. రేగా.. రేగా… అనే నినాదాలతో పల్లెలన్నీ మారుమోగిపోతున్నాయి. కాంతారావు వస్తున్నారని సమాచారం తెలుసుకుంటున్న ఆయా గ్రామాల ప్రజలు ఎన్ని గంటలైనా రేగా కొరకు ఎదురుచూస్తూ .. ఘన స్వాగతం పలుకుతున్నారు. మంగళ హారతులతో ఆశీర్వదిస్తూ.. దీవిస్తున్నారు. అభివృద్ధి కొనసాగాలంటే కాంతన్నే రావాలంటే బహిరంగంగా నినాదాలు చేయడం ఆ నాయకుని పై ఉన్న ప్రేమను తెలియపరుస్తుంది. ఈ గ్రామానికి వెళ్లిన బీఆర్ఎస్ పినపాక నియోజకవర్గం అభ్యర్థి రేగా కాంతారావుకు వస్తున్న అపూర్వ ఆదరణలో చూసి ప్రతిపక్ష నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఏ మూలకు వెళ్లిన రేగా కాంతారావు గెలుపు తథ్యం అనే మాట వినిపిస్తుంది అంటే పినపాక నియోజకవర్గం అభివృద్ధికి రేగా కాంతారావు ఎంత కృషి చేశాడో ఇట్టే అర్థమవుతుంది. రేగా కాంతారావు భారీ మెజార్టీతో గెలవడం ఖాయం అంటూ బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుకుంటున్నారు.