మన్యం న్యూస్, మంగపేట.
రాజుపేట ఉన్నత పాఠశాల విద్యార్థినిలకు భవిష్యత్తులో ఆత్మరక్షణ కోసం కరాటే శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు రావుల భాస్కరరావు తెలియజేశారు. అమ్మాయి లు అంటే అభలు కాదు ఆది శక్తి, పరా శక్తి అని అటువంటి బాలికల కు మనో ధైర్యం, శారీరక శక్తి కోసం కరాటే ఇప్పిస్తున్నామని ప్రధానోపాధ్యాయులు తెలియజేశారు.బాలికలు స్వీయ రక్షణ ఆత్మ రక్షణ ఎలాంటి సమస్యనైనా తృణప్రాయంగా తీసుకొని సమస్యలను పరిష్కరించుకోగలరని శారీరక కండరాల పోషణ కోసం కరాటే శిక్షణ అవసరమని, మానసికంగా ఆత్మవిశ్వాసం పెరుగుతుందని తద్వారా ఎలాంటి సమస్యనైనా చాలా సులభంగా పరిష్కరించుకునే సామర్థ్యం శారీరక వ్యాయామల ద్వారానే సాధ్యమవుతుందని ప్రతి విద్యార్థిని కచ్చితంగా కరాటే శిక్షణ తీసుకోవాల్సిన అవసరం ఉందని భవిష్యత్తులో ఏ సమస్య అయినా పరిష్కరించే మానసిక సామర్థ్యం శారీరక సామర్థ్యం కలుగుతుందని భాస్కర రావు అన్నారు. కరాటే శిక్షణకుడిగా చందా హనుమంతరావుని నియమించామని శిక్షణ ద్వారా విద్యార్థులు చదువుతో పాటు కరాటే కూడ అభ్యసిస్తూ విద్యార్థులు ఎంతో ఇష్టం తో పాఠశాల కు వస్తారని తద్వారా విద్యార్థుల హాజరు శాతం కూడా పెరుగుతుంది, విద్య పై కూతుహలం పెరిగి ఉన్నత విద్య ను అభ్యసించి భవిష్యత్ లో మంచి విజయాలు సాధిస్తారు అని తెలియజేశారు.ఈ కార్యక్రమం లో పాఠశాల సీనియర్ ఉపాధ్యాయులు గడ్డం శ్రీనివాస్, ఎస్ జమున, రాజ్యలక్ష్మి, ఏ పావని, డి పద్మ, లావణ్య, మహాదేవి, సుజాత, స్రవంతి,దుర్గం,లక్ష్మీనారాయణ, సురేందర్ తదితరులు పాల్గొన్నారు