UPDATES  

 ఓటర్లు మన అతిథులు.. పోలీ ప్రత్యేక పరిశీలకులు దీపక్ మిశ్రా..

 

మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:

ఓటర్లు మన అతిధులని స్వేచ్చగా ఓటుహక్కు వినియోగానికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా పకడ్బంది ఏర్పాట్లు చేయాలని పోలీ ప్రత్యేక పరిశీలకులు దీపక్ మిశ్రా తెలిపారు. గురువారం ఐడిఓసి కార్యాలయపు మిని

సమావేశపు హాలులో పోలింగ్ ప్రక్రియ నిర్వహణకు సన్నద్ధపై జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ ప్రియాంక అల, ఎస్పి,

డాక్టర్ వినీత్, సాధారాణ, పోలీస్ పరిశీలకులు, రిటర్నింగ్ అధికారులతో కలెక్టరేట్ ని మిని సమావేశపులో సమీక్ష

నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణకు శాంతిభద్రతల అంశం అత్యంత

ప్రధానమని చెప్పారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో కేంద్ర, రాష్ట్ర పోలీస్ బలగాలతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు

చేయాలని చెప్పారు. పోలింగ్ కేంద్రాల సమీపంలో వ్యక్తులు గుమికూడకుండా ప్రశాంతంగా ఉండేందుకు 144

సెక్షన్ అమలు చేయాలని చెప్పారు. ఓటుహక్కు వినియోగించుకున్న ఓటర్లు వేచియుండకుండా తిరిగి వెళ్లే విధంగా

చర్యలు చేపట్టాలని చెప్పారు. పోలింగ్ స్టేషన్కు దగ్గర్లో ప్రజలు గుమికూడకుండా చర్యలు చేపట్టాలని చెప్పారు.

పోలింగ్ కేంద్రాల వద్ద అనుమతి కలిగిన గుర్తింపు కార్డుదారులను మాత్రమే ఎన్నికల సంఘ నియమావళి వేరకు

అనుమతించాలని చెప్పారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుండి ఈవియంలు రవాణాలో పోలీస్ బందోబస్తుతో తరలించాలని

చెప్పారు. పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న మెటీరియల్ అత్యంత జాగ్రత్తగా బద్రపరచాలని చెప్పారు. గివ్యాంగులు,

80 ఏళ్లు నిండిన వయోవృద్దుల హెూం ఓటింగ్ ప్రక్రియను అడిగి తెలుసుకున్న ఆయన హెూం ఓటింగ్ ప్రక్రియను

వీడియో గ్రఫి చేయాలని చెప్పారు. హెూం ఓటింగ్ ప్రక్రియ నిర్వహణపై నియోజకవర్గాల వారిగా షెడ్యూలు

రూపొందించి పోటీచేయు అభ్యర్థులకు సమాచారం అందించి ఏజంట్లు సమక్షంలో జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని

చెప్పారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ప్రక్రియను నింరతర పర్యవేక్షణ చేయాలని చెప్పారు. క్రిటికల్

పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ తో పాటు పోలింగ్ కేంద్రాల బయట శాంతిభద్రతలు పర్యవేక్షణకు సిసి టివిలు

ఏర్పాటు చేయాలని చెప్పారు. పోలింగ్ నిర్వహణలో వచ్చే వదంతులపై ప్రత్యేక పర్యవేక్షణ చేయాలని, ఎప్పటికపుడు

అలాంటి అసత్య వార్తల పట్ల తక్షణమే స్పందించాలని, వదంతుల పట్ల అప్రమత్తంగా ఉండాలని వెంటనే చర్యలు

తీసుకోవాలని అన్నారు. ఏర్పాట్లు పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన ఆయన తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలున్న జిల్లాలో

ఎన్నికల నిర్వహణకు పటిష్ట రక్షణ చర్యలు చేపట్టాలరని జిల్లా కలెక్టరు, ఎస్పిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ సమావేశంలో సాధారణ పరిశీలకులు కమలికిషోర్, హరికిషోర్, గణేష్, పోలీసు పరిశీలకులు స్వపన్

సర్కార్, జయంత్

సింగ్, రిటర్నింగ్ అధికారులు ప్రతీక్ జైన్, రాంబాబు, శిరీష, మంగీలాల్, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !