UPDATES  

 కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం నాయకులు కోమటిరెడ్డి రాజశేఖర్ రెడ్డి బిఆర్ఎస్ లో చేరిక..బిఆర్ఎస్ కండువా కప్పి ఆహ్వానించిన ప్రభుత్వ విప్ రేగా..

 

 

మన్యం న్యూస్ బూర్గంపహాడ్,అశ్వాపురం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక గ్రామపంచాయతీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు సమక్షంలో అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బూర్గంపాడు, కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం నాయకులు కోమటిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, బత్తుల రాజేష్, టి. మోహన్ రావు, సిరికొండ నరేష్, అశ్వాపురం మండల కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం ఉపాధ్యక్షులు సామ సందీప్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ యువజన నాయకులు మాసిరెడ్డి హరీష్ రెడ్డి, కొండ ప్రేమ్ గౌడ్ బిఆర్ఎస్ పార్టీలో చేరారు.ఈసందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు వారిని గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు కావడంతో ప్రజలు రాజకీయాల అతీతంగా బిఆర్ఎస్ పార్టీని విశ్వసిస్తున్నారని ఆయన అన్నారు.తెలంగాణ అభివృద్ధిని చూసి ప్రజలంతా బిఆర్ఎస్ కు మద్దతు ఇస్తున్నారని పేదల సంక్షేమ విషయంలో సీఎం కేసీఆర్ రాజీ పడే ప్రసక్తే లేదని పార్టీ కోసం నిజాయితీగా కష్టపడే వారికి పార్టీలో తగిన గుర్తింపు ఉంటుంది అన్నారు. కాంగ్రెస్ అబద్ధపు హామీలు నమ్మి ప్రజలు మోసపోవద్దని అభివృద్ధిని చూసి ఓటు వేయాలని ఆయన అన్నారు. సీఎం కేసీఆర్ రైతులకు రైతుబంధు రైతు బీమా 24 గంటలు ఉచిత కరెంటు ఇస్తూ రైతులకు హక్కును చేర్చుకున్నారని ఆయన అన్నారు. మరోసారి అవకాశం ఇస్తే మరిన్ని పథకాలు తీసుకువస్తారని తెలిపారు.కారు గుర్తుకు ఓటు వేసి తనని గెలిపించాలని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో మిట్ట కంటి సురేందర్ రెడ్డి,బొక్క శ్రీకాంత్ రెడ్డి,ఎస్కే అబ్బాస్,గుగులోతు రవి,భూక్య కిరణ్ సాయి,మిట్ట కంటి మహేందర్ రెడ్డి,జక్కుల సందీప్ తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !