మన్యంన్యూస్ ఇల్లందురూరల్:- ఇల్లందు మండలం లచ్చగూడెం గ్రామపంచాయతీ కొమ్ముగూడెం గ్రామానికి చెందిన 140 కుటుంబాలు కాంగ్రెస్, న్యూడెమోక్రసీ పార్టీల నుండి బిఆర్ఎస్ పార్టీలో నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బానోత్ హరిప్రియ నాయక్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారిని ఎమ్మెల్యే హరిప్రియ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వారికి అభినందనలు తెలిపారు. ఈ సందర్బంగా హరిప్రియ మాట్లాడుతూ సీఎం కెసిఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమానికి మద్దతుగా కాంగ్రెస్, న్యూడెమోక్రసీ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, గ్రామా ప్రజలు బిఆర్ఎస్ పార్టీలో పెద్ద ఎత్తున చేరారు అని తెలిపారు, ఇల్లందు నియోజకవర్గం లో ఇప్పటికే చాలా అభివృద్ధి జరిగిందని మరోసారి ఆశీర్వదిస్తే మరింత అభివృద్ధి చేసుకుందామని హరిప్రియ తెలిపారు.పార్టీలో చేరిన వారికి భవిష్యత్తులో సముచిత స్థానం కల్పిస్తామన్నారు. బిఆర్ఎస్ సర్కార్ అమలు చేసిన సంక్షేమ పథకాలను గడపగడపకు వెళ్లి ప్రచారం చేయాలని పులుపునిచ్చారు, గత ప్రభుత్వాలు చేయలేని అభివృద్ధిని ఈ తొమ్మిదిన్నర సంవత్సరంలో బిఆర్ఎస్ ప్రభుత్వం చేసినతువంటి అభివృద్ధిని ప్రజలకు వివరించి తద్వారా మూడోసారి అధికారంలోకి వచ్చేలా ప్రతి ఒక్కరు అహర్నిశలు కృషి చేయాలన్నారు. ఇల్లందు నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మీ ముందుకు వచ్చాను.ప్రజలు దీవించాలని కోరారు. కార్యకర్తలే పార్టీకి అండ గా బీఆర్ఎస్ మేనిఫెస్టో ప్రజల దగ్గరకు తీసుకువెళ్లి వివరించాలన్నారు. ఎన్నికల నేపథ్యంలో కొందరు స్వార్ధ రాజకీయం కోసం ఓట్ల అడగడానికి వస్తారని వారిని నమ్మితే నట్టేట ముంచుతారని, ప్రజల అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్,న్యూ డెమోక్రసీ పార్టీల నుంచి బిఆర్ఎస్ పార్టీలో చేరిన జర్పుల బౌసింగ్ ,జర్పుల బోడ,జర్పుల అనిల్, గుగులోత్ రఘు, గుగులోత్ రామ్ సింగ్,జర్పుల రామ, ఏ.సంత, జే.అచ్చయ్య, బి.నగేష్, డి.బాలు, తదితరులు బీఆర్ఎస్ లక్ష్యంగా పనిచేస్తామనీ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు మండల వైస్ ఎంపీపీ దాస్యం ప్రమోద్ కుమార్, బిఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి ఖమ్మంపాటి రేణుక, ఉపాధ్యక్షులు బానోత్ రమేష్, మండల కో ఆప్షన్ గాజి, బీఆర్ఎస్ నాయకులు మూడు హనుమా, జర్పుల సురేష్, శంకర్, లాకావత్ ప్రసాద్, భుఖ్య శ్రీను, గుగులోత్ మోతిలాల్,భుఖ్య పాపాలాల్ తదితరులు పాల్గొన్నారు.