మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం టౌన్:
కలెక్టర్ డాక్టర్ ప్రియాంక సూచనలు మేరకు జిల్లా సమాచార శాఖ వారి ఆదేశాల అనుసారం మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో గురువారం స్థానిక ప్రియదర్శిని డిగ్రీ కళాశాలలో ఓటు వినియోగించుకోవాలని మాట పాటలు ద్వారా అవగాహన కల్పించారు. ఈ అవగాహన కార్యక్రమంలో టీమ్ లీడర్ పాగి వెంకన్న, పమ్మి రవి, యంగల కుమారి, బొమ్మెర ముత్యం, గోవింద గురవయ్య, నకిరికంటి వెంకటేశ్వర్లు, కొండ్రు హుస్సేన్ తదితర బృంద సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ శ్రీరామనేని చలపతిరావు, ప్రిన్సిపాల్ డాక్టర్ షేక్ పాషా, వైస్ ప్రిన్సిపాల్ రాయల్ వివేక్, పీ.డి కాశిమల్ల రమేష్, అధ్యాపకు బృందం పాల్గొన్నారు.