UPDATES  

 701 మంది ఇంటి నుండి ఓటు హక్కు..

మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:

దివ్యాంగులు, 80 సంవత్సరాలు పైబడిన

వయోవృద్దులకు ఇంటి నుండి ఓటుహక్కు వినియోగానికి అవకాశం కల్పించగా గురువారం వరకు 701 మంది ఓటుహక్కు వినియోగించుకున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల తెలిపారు. జిల్లాలో దివ్యాంగులు, వయోవృద్దులు 766 మందికి ఫారం 12 డి ద్వారా హోం ఓటింగ్ కు అవకాశం కల్పించినట్లు చెప్పారు. హోం ఓటింగ్ నిర్వహణకు 35 టీములు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. గురువారం వరకు 701 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని, మిగిలిన 65 మంది హోం ఓటర్లు ఈ నెల 24 తేదీలోగా హోం వోటింగ్ వినియోగించుకోడానికి అవకాశం ఉన్నట్లు చెప్పారు. హోం బ్యాలెట్ వినియోగానికి పటిష్ట బందోబస్తు, వీడియో గ్రఫీ నడుమ ఓటుహక్కు వినియోగానికి చర్యలు తీసుకునున్నట్లు చెప్పారు. హోం ఓటింగ్ సమాచారాన్ని అన్ని రాజకీయ పార్టీలకు అందించినట్లు ఆమె పేర్కొన్నారు. ఇంటి నుండి ఓటు హక్కు వినియోగానికి ఎన్నికల సంఘం నియమ, నిబంధనలు మేరకు షెడ్యూల్ తయారు చేశామని, అట్టి షెడ్యూల్ ప్రకారం హోం ఓటింగ్ నిర్వహిస్తున్నట్లు ఆమె స్పష్టం చేశారు. ఓటరు స్లిప్పులు 966439 మంది ఓటర్లు కు పంపిణీ చేయాల్సి ఉండగా గురువారం వరకు 921686 పంపిణీ చేశామని, మిగిలిన 44753 ఓటరు స్లిప్పులు రేపటితో పూర్తి చేయనున్నట్లు ఆమె చెప్పారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !