UPDATES  

 కదం తొక్కిన బీఆర్ఎస్ శ్రేణులు హోరెత్తిన ప్రచారం…అడుగడుగున రేగాకు బ్రహ్మరథం పట్టిన ప్రజలు..

  • కదం తొక్కిన బీఆర్ఎస్ శ్రేణులు హోరెత్తిన ప్రచారం
  • అడుగడుగున రేగాకు బ్రహ్మరథం పట్టిన ప్రజలు
  • ఇరిగేషన్,విద్య,వైద్య రంగాలకు పెద్దపీట
  • ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే లక్ష్యం
  • పిజి కాలేజీ,ఇంజనీరింగ్ కాలేజీలు ఏర్పాటు చేస్తాం
  • ప్రభుత్వ ఆసుపత్రిని 350 పడకలకు పెంపు
  • దళితులందరికి దళిత బంధు
  • మణుగూరును రెవెన్యూ డివిజన్ చేస్తాం
  • ఎన్నికల ప్రచారంలో ప్రభుత్వ విప్ రేగా కాంతారావు

మన్యం న్యూస్ మణుగూరు:

 

మణుగూరు మండలం,పట్టణ పరిధిలోని గ్రామాలలో ప్రభుత్వ విప్,బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి రేగా కాంతారావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ ప్రచారంలో రేగాకు అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పట్టారు.మంగళ హారతులు,పూల మాలలతో మహిళలు వారికి ఘన స్వాగతం పలికారు.ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ రేగా కాంతారావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ హయాం లో బడుగు బలహీన వర్గాల ప్రజలందరికీ న్యాయం చేయడం జరిగిందన్నారు.పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా అనేక సంక్షేమ పథకాలను ప్రజలకు అందించడం జరిగిందని అన్నారు.ఇంటింటికి స్వచ్ఛమైన మంచినీరును అందించిన ఘనత బిఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. రైతులకు రైతుబంధు,రైతు బీమా, 24 గంటల ఉచిత కరెంటు అందజేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు.మహిళల సంక్షేమమే లక్ష్యంగా కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్,కెసిఆర్ కిట్టు, న్యూట్రిషన్ కిట్టు,ఆరోగ్యలక్ష్మి వంటి పథకాలను అమలు చేయడం జరిగిందన్నారు.అభివృద్ధి,సంక్షేమ పథకాలే బిఆర్ఎస్ కు శ్రీరామరక్ష అని రేగా తెలిపారు.సీఎం కేసీఆర్ నాయకత్వంలో బిఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుబంధు తరహాలో పేదలందరికీ కేసీఆర్ బీమాతో ప్రతి ఇంటికి ధీమా కల్పిస్తామన్నారు.దేశంలో ఎక్కడా లేనివిధంగా ఆసరా పింఛన్లు 2016 రూపాయలు ఇవ్వడం జరుగుతుందని,గెలిచిన తర్వాత విడతలవారీగా 5016 రూపాయల పెన్షన్ అందించడం జరుగుతుందన్నారు.దివ్యాంగులకు 4016 పెన్షన్ ఇస్తున్నామని,దానిని 6016 రూపాయలకు పెంచుతామన్నారు.పేదలందరికి అన్నపూర్ణ ద్వారా సన్న బియ్యం అందజేస్తామన్నారు.ఆరోగ్య రక్ష పథకం ద్వారా పేదలందరికీ నాణ్యమైన వైద్యం అందిస్తామని తెలిపారు.రైతుబంధు 10 వేల నుండి 16 వేలకు పెంచుతామన్నారు.మణుగూరు ప్రాంతాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయడం జరిగిందని వారు తెలిపారు.పాలిటెక్నిక్ కాలేజీ ఏర్పాటు చేయడం,ఆర్టీవో ఆఫీస్ ఏర్పాటు చేయడం జరిగింది అన్నారు.వెజ్ నాన్ వెజ్ మార్కెట్ గ్రంథాలయం నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. మణుగూరు ను రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేస్తామని వారు తెలిపారు.వంద పడకల ఆసుపత్రిని కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. అత్యాధునిక సదుపాయాలతో ఆపరేషన్ థియేటర్,డయాలసిస్ సెంటర్,ఆక్సిజన్ ప్లాంటు,బ్లడ్ స్టోరేజీ బ్యాంకు వంటి సదుపాయాలు ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు.పోస్టుమార్టం సేవలు సైతం మణుగూరులోనే ఏర్పాటు చేశామన్నారు.వంద పడకల ఆసుపత్రి సామర్ధ్యాన్ని పెంచి 350 పడకలుగా చేస్తామన్నారు.విద్య, వైద్య రంగానికి పెద్ద పీట వేస్తామన్నారు.పీజీ,ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. నియోజకవర్గం లోని దళితులందరికీ దళిత బంధు ఇస్తామని హామీ ఇచ్చారు. మణుగూరు రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేస్తామన్నారు. మణుగూరు ప్రాంత అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నానని వారు తెలిపారు.రానున్న ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ కారు గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని రేగా కాంతారావు ప్రజలను కోరారు.ఈ కార్యక్రమంలో జడ్పిటిసి పోశం.నరసింహారావు, ఎంపీపీ కారం విజయ కుమారి, సొసైటీ చైర్మన్ కుర్రి నాగేశ్వరరావు, బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అడపా అప్పారావు,మండల అధ్యక్షులు ముత్యం బాబు, కార్యదర్శి రామిరెడ్డి,పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బొలిశెట్టి నవీన్,సీనియర్ నాయకులు యాదగిరి గౌడ్, రాంబాబు,కృష్ణ,నూకారపు రమేష్, యూసఫ్ షరీఫ్,నియోజకవర్గ కోఆర్డినేటర్ నవీన్ బాబు,యువజన విభాగం అధ్యక్షులు సాగర్ యాదవ్, బిఆర్ఎస్వి రాష్ట్ర కార్యదర్శి ఎన్ ఎన్ రాజు,పార్టీ నాయకులు, యువజన నాయకులు,సోషల్ మీడియా సభ్యులు,బిఆర్ఎస్వి నాయకులు,పార్టీ కార్యకర్తలు, మహిళా నాయకులు,బిఆర్ఎస్ పార్టీ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !