- మోసపోతే గోసపడతాం
- 50 ఏళ్ల కాంగ్రెస్ పరిపాలనలో పేదలకు మంచి నీళ్లు ఇవ్వలేదు
- బిఆర్ఎస్ పరిపాలనలో ఇంటింటికి మంచినీరు
- 3 గంటల కాంగ్రెస్ కావాలా 24 గంటల బిఆర్ఎస్ కావాలా
- రైతుబంధు,రైతు భీమా,దళిత బంధు పుట్టించిందే బిఆర్ఎస్
- కరోనా సమయంలో కానరాని పాయం
- నేడు ఆరు గ్యారెంటీలతో ప్రజలను మోసం
- ఖమ్మం గులాం కావాలా మణుగూరు సేవకుడు కావాలా
- ప్రజలు ఆలోచించి ఓటు వేయాలి
- ఎన్నికల ప్రచారంలో ప్రభుత్వ విప్ రేగా
మన్యం న్యూస్ మణుగూరు:
ఎన్నికలు రాగానే ఆగమాగం కావద్దని,మోసపోతే గోసపడతామని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు అన్నారు.మణుగూరు మండల,పట్టణ పరిధిలో రేగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉన్న తెలంగాణను ఉడగొట్టిందే కాంగ్రెస్ అని రేగా కాంతారావు మండిపడ్డారు.50 ఏళ్ల కాంగ్రెస్ పరిపాలనలో పేదలకు మంచి నీళ్లు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉండేదన్నారు.నాడు బిందెలతో మహిళలు నీళ్ల కోసం గొడవలు పడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని అన్నారు.రైతాంగానికి కరెంటు లేక రైతుల ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితిని నాడు కాంగ్రెస్ పరిపాలనలో ఉండేదని ధ్వజమెత్తారు.సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజల హక్కుల కోసం, సమస్యల పరిష్కారం కోసం 14 ఏళ్లు సుదీర్ఘ పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం జరిగిందన్నారు.నేడు మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి స్వచ్ఛమైన మంచినీరు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వం అని తెలిపారు. రైతాంగానికి పెద్ద పీట వేసి రైతుబంధు,రైతు బీమా 24 గంటల ఉచిత కరెంటు అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుంది అన్నారు.దళితుల జీవితాలలో వెలుగుల నింపాలని దళిత కుటుంబాల అభ్యున్నతికై దళిత బంధు పథకాన్ని అమలు చేయడం జరుగుతుంది అన్నారు.రాష్ట్రంలో 33 జిల్లాలను ఏర్పాటు చేసుకొని,కలెక్టరేట్ కార్యాలయాలు, పరిపాలన భవనాలు,33 జిల్లాలకు 33 మెడికల్ కాలేజీ లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.విద్య, వైద్య రంగానికి బిఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద పీట వేసిందన్నారు.పేద ప్రజల సంక్షేమం కోసం బిఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలందరికీ అందుతున్నాయని అన్నారు. అభివృద్ధి,సంక్షేమం కొనసాగాలన్న, కొత్త సంక్షేమ పథకాలు అమలు కావాలన్నా బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావాలన్నారు. కాంగ్రెస్ మాయ మాటలు నమ్మి ఓటు వేస్తే,మోసపోతే గోసపడతామని రేగా తెలిపారు. ఒకప్పుడు ఎట్లుండే తెలంగాణ ఇప్పుడు ఎట్లయింది తెలంగాణ ప్రజల కళ్ళముందే ఉందన్నారు. ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని ఎన్నికలు రాగానే ఆగమాగం కావొద్దు అని ప్రజలకు సూచించారు. కరోనా కోరల్లో చిక్కుకొని ప్రజలు కష్టాలలో ఉంటే కనీసం పట్టించుకునే వాళ్ళు,నేడు ఎన్నికల అనగానే కొత్త మొహాలు వేసుకొని ప్రజల ముందుకు వస్తున్నారని, ఎన్నికలు పూర్తయిన తర్వాత ఎవరూ కనపడరని,అలాంటి వారికి ఓటు వేస్తే అభివృద్ధి తిరోగమనం వైపు వెళ్తుంది అన్నారు. ఖమ్మం గులాం కావాలో పినపాక సేవకుడు కావాలో ప్రజలు ఆలోచించి ఓటు వేయాలన్నారు.సీఎం కేసీఆర్ యే తెలంగాణకు శ్రీరామరక్ష అని వారు తెలిపారు.రానున్న ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని ప్రజలను కోరారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు,పార్టీ నాయకులు,అనుబంధ సంఘాల నాయకులు,యువజన నాయకులు, బిఆర్ఎస్వి నాయకులు,సోషల్ మీడియా సభ్యులు,మహిళా కార్యకర్తలు,పార్టీ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.