మన్యం న్యూస్ మణుగూరు:
మణుగూరు మండలం లోని తహసిల్దార్ కార్యాలయంలో ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల ఏజెంట్లతో పినపాక నియోజకవర్గ అసెంబ్లీ ఎన్నికల ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ అజయ్ లాల్ చంద్ సోనేజీ గురువారం సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా అభ్యర్థులు నామినేషన్ వేసిన రోజు నుండి నేటి వరకు ఖర్చు చేసిన వివరాల రిజిస్టర్లను ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ అజయ్ లాల్ చంద్ సోనేజీ పరిశీలించడం జరిగింది అని అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి రాఘవరెడ్డి తెలిపారు.ఈ కార్యక్రమంలో పినపాక నియోజవర్గ అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు ఎక్స్పెండిచర్ టీం మహేష్,అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి రాఘవరెడ్డి,ఎక్స్పెండ్ టీచర్,అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.