- టాప్ గేర్ లో కారు ప్రచార హోరు
- కెసిఆర్ బీమా తో ఇంటింటికి ధీమా
- సౌభాగ్య లక్ష్మితో మహిళలకు భరోసా
- ఆరోగ్య రక్ష తో పేదలకు నాణ్యమైన వైద్యం
- అన్నపూర్ణ ద్వారా ప్రజలందరికీ సన్న బియ్యం
- ఎన్నికల ప్రచారంలో ప్రభుత్వ విప్ రేగా కాంతారావు
మన్యం న్యూస్ మణుగూరు:
మణుగూరు మండలం లోని కూనవరం బాంబే కాలనీ,పీవీ కాలనీలో,సింగరేణి కాలనీలలో ప్రభుత్వ విప్,బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రేగా కాంతారావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.బిఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి,సంక్షేమ పథకాలు బడుగు బలహీన వర్గాల ప్రజలకు అండగా నిలుస్తున్నాయని అన్నారు.సీఎం కేసీఆర్ ప్రకటించిన బిఆర్ఎస్ పార్టీ మ్యానిఫెస్టోతో పేద,మధ్యతరగతి ప్రజలందరికీ ఎంతో మేలు జరుతుందని అన్నారు.మూడోసారి బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాగానే కెసిఆర్ బీమా పథకం ద్వారా రాష్ట్రం లోని 93 లక్షల మంది పేద కుటుంబాలకు భీమా కల్పించడం,జరుగుతుందన్నారు.అర్హులైన మహిళలందరికీ సౌభాగ్య లక్ష్మీ ద్వారా ఆర్థిక భరోసా కల్పిస్తామన్నారు.అన్నపూర్ణ ద్వారా పేదలందరికీ సన్న బియ్యం అందజేస్తామన్నారు.400 రూపాయలకే గ్యాస్ ఇస్తామన్నారు. రైతు బంధు పథకం ద్వారా రైతులకు ఎకరానికి 10 వేలు ఇస్తుండగా వాటిని 16 వేలకు పెంచుతామని,ఆసరా పింఛన్లు 5 వేలు,దివ్యాంగు లకు 6 వేలు చెల్లిస్తామన్నారు.ఆరోగ్య రక్ష ద్వారా పేదలకు నాణ్యమైన వైద్యం అందిస్తామని తెలిపారు.గతంలో మణుగూరు ఎలా ఉన్నదో,నేడు డివైడర్లు,సెంటర్ లైటింగ్ తో ఎలా వెలిగిపోతుందో ప్రజలు గమనించాలన్నారు.మణుగూరు లో పాలిటెక్నిక్ కాలేజీ,వెజ్ నాన్ వెజ్ మార్కెట్,లైబ్రరీ,సురక్ష బస్టాండ్, ఆర్టీవో ఆఫీస్ వంటి అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలన్నీ ప్రజల కళ్ళముందే ఉన్నాయన్నారు.ప్రజలు అన్ని విషయాలను గమనించి సంక్షేమ ప్రభుత్వానికి అండగా నిలవాలని అన్నారు.రాబోయే ఎన్నికల్లో మరొకసారి బిఆర్ఎస్ పార్టీ కారు గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని ప్రజలను కోరారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ స్థానిక ప్రజాప్రతినిధులు,పార్టీ సీనియర్ నాయకులు,అనుబంధ సంఘాల నాయకులు,యువజన నాయకులు,బిఆర్ఎస్వి నాయకులు సోషల్ మీడియా సభ్యులు,మహిళా కార్యకర్తలు,అభిమానులు తదితరులు పాల్గొన్నారు.