- బిడ్డ నీ సంగతి తేల్చే వరకు వదిలి పెట్టేది లేదు.
- ఖబర్దార్ నాపై దాడి చేయిస్తారా?
- ఎంత దమ్ము? నా కారు పై రాళ్లతో దాడి చేస్తారా
- నాపై దాడి జరగడానికి కారణంఎస్ఐ తీరే
- ఎస్సై అడ్డుకోవడం తో అదునుగా భావించి రెచ్చిపోయిన అల్లరి మూక
- అల్లరి మూక చేతిలో రాళ్లు ,కర్రలు
- పోలీస్ తీరుపై ఎలక్షన్ కమిషన్ కి ఫిర్యాదు
మన్యం న్యూస్,పినపాక: బీఆర్ఎస్ పినపాక నియోజకవర్గ అభ్యర్థి రేగా కాంతారావు తనపై గురువారం ఏడుల బయ్యారం కాంగ్రెస్ అల్లరి మూకలు దాడి చేసిన తీరుపై ఘాటుగా స్పందించారు. ఆయన గురువారం ఏడోళ్ల బయ్యారం పోలీస్ స్టేషన్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎస్సై సతీష్ తనను నాలుగు సార్లు అడ్డుకున్నారని, దీనినే అదనగా భావించిన కాంగ్రెస్ పార్టీ అల్లరి ముక తనపై , తన కారుపై దాడికి పాల్పడ్డారని తెలిపారు. ఏ ఒక్కరిని వదిలిపెట్టనని… ఏడూళ్ల బయ్యారం సెంటర్లో రేగ రాజకీయం ఎట్లా ఉంటుందో చూపెడతానని హెచ్చరించారు. రాజకీయ హుందాతనంగా ఉండాలి తప్ప ఇలా దిగజారుడు రాజకీయాలకు పాల్పడవద్దన్నారు. కార్యకర్తలందరూ ధైర్యంగా ఉండాలని ఎవరికి భయపడాల్సిన పని లేదన్నారు. తనపై దాడికి పాల్పడిన వారి వివరాలను జిల్లా ఎస్పీ మణుగూరు డిఎస్పీకి వీడియోలు పంపడం జరిగిందని, అలాగే దాడికి కారకులైన ఎస్సై సిఆర్పిఎఫ్ సిబ్బందిపై మణుగూరులో ఎలక్షన్ కమిషన్ కి ఫిర్యాదు చేస్తానని తెలిపారు.