మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలోని ఐదు నియోజకవర్గాలలో గురువారం జరిగిన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మధ్యాహ్నం ఒంటిగంటకు 39.14 శాతం పోలింగ్ నమోదు కాగా మధ్యాహ్నం మూడు గంటలకు 58.39 శాతం పోలింగ్ నమోదు అయింది. సాయంత్రం ఐదు గంటల వరకు 66.40 శాతం పోలింగ్ నమోదు అయినట్లు జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ ప్రియాంక అల తెలిపారు. భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా ఐదు నియోజకవర్గాల్లో 5 గంటల వరకు పోలింగ్ నమోదు వివరాలు ఇలా ఉన్నాయి. పినపాక 65.02, ఇల్లందు 65.19, కొత్తగూడెం 64.73, అశ్వరావుపేట 71.84, భద్రాచలం 67.03 శాతం నమోదయింది. జిల్లా వ్యాప్తంగా సాయంత్రం ఐదు గంటల వరకు 66.40 శాతం పోలింగ్ నమోదైనట్లు చెప్పారు. ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఓటర్లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా కేంద్రాలలో జిల్లా కలెక్టర్ ప్రియాంక ఏర్పాట్లు చేయించడం జరిగింది. ఎన్నికల సరళి తీరును ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక, జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్.జి పరిశీలించారు. 18 సంవత్సరాలు దాటిన వారంతా ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకున్నారు.