మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో: జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సిపిఐ పార్టీ అభ్యర్థి గెలుపు కొరకు అహర్నిశలు కృషి చేశారని అన్నారు. శుక్రవారం శేషగిరి భవన్ నందు జరిగిన పాత్రికేయల సమావేశంలో జిల్లా కార్యదర్శి సాబీర్ పాష మాట్లాడుతూ
జిల్లాలోని భద్రాచలం, అశ్వరావుపేట, ఇల్లందు, పినపాక నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కొరకు సిపిఐ పార్టీ శ్రేణులు కృషి చేశారన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం ఖాయమన్నారు. 30వ తేదీన జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ సిపిఎం, టీజేఎస్, టిడిపి ప్రజాపంథాలు బలపరిచిన సిపిఐ అభ్యర్థి కూనమనేని సాంబశివరావు కంకి కోడవలి గుర్తుపై ఓటు వేసి సహకరించిన కొత్తగూడెం నియోజకవర్గ ప్రజలకు జిల్లా కార్యదర్శి సాబీర్ పాష కృతజ్ఞతలు తెలిపారు.