- ఓట్ల లెక్కింపుకు ఏర్పాట్లు పూర్తి
- స్ట్రాంగ్ రూములో ఈవీఎంలు భద్రం
- ముడంచల భద్రతతో పహారా
- కలెక్టర్ డాక్టర్ ప్రియాంక నిరంతర పర్యవేక్షణ
- ఓట్ల లెక్కింపు సిబ్బందికి అన్ని ఏర్పాట్లు
మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణ పరిధిలోని అనుబోస్ ఇంజనీరింగ్ కళాశాలలో ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి కావడం జరిగింది. జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్
ప్రియాంక ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారు. ఈనెల మూడో తేదీన ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో అందుకు కావలసిన ఏర్పాట్లను చక చక పూర్తి చేశారు. ఓట్ల లెక్కింపు సమయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా కలెక్టర్ ప్రియాంక ఆరా తిస్తూ పర్యవేక్షణ చేస్తున్నారు. గత నెల 30వ తేదీన జిల్లా పరిధిలోని ఐదు నియొకవర్గాల్లోని 1098 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ప్రక్రియ జరిగింది. ఇందుకు సంబంధించిన కౌంటింగ్ మెటీరియల్ ను స్ట్రాంగ్ రూములకు తరలించారు. కౌంటింగ్ ప్రక్రియకు ప్రతి నియోజకవర్గానికి 14 టేబుల్స్ ఏర్పాటు చేశారు. పర్యవేక్షణకు 18 టీములు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి టేబుల్ కు ఒక సూక్ష్మ పరిశీలకులు, కౌంటింగ్ సూపర్ వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్ లను నియమించారు. భద్రాద్రి జిల్లాలోని ఐదు నియోజకవర్గాలకు సంబంధించిన ఇక్కడ కౌంటింగ్ జరగనున్నది.
కౌంటింగ్ ప్రక్రియ విధులు నిర్వహించే సిబ్బంది ఉదయం 6 గంటలకు కౌంటింగ్ కేంద్రానికి చేరుకోవాలని అధికారులు సూచించారు.
కౌంటింగ్ ప్రక్రియ ఉదయం 8 గంటల నుండి ప్రారంభమవుతుందని చెప్పారు.