- మావోయిస్టుల వ్యూహాలకు బ్రేక్
- ఎన్నికల వేళ రాష్ట్ర సరిహద్దుల్లో 40 కేజీల ల్యాండ్ మైన్
- బాంబును కనిపెట్టి నిర్వీర్యం చేసిన పోలీసు బలగాలు
- సిఆర్పిఎఫ్ బలగాలకు అభినందనలు తెలిపిన ఎస్పీ డాక్టర్ వినీత్. జి
మన్యం న్యూస్ చర్ల:
తెలంగాణ రాష్ట్రంలోని సార్వత్రిక ఎన్నికలను బహిరస్కరించాలనే నేపంతో రాష్ట్ర సరిహద్దు మండలమైన చర్ల ఏజెన్సీ అటవీ ప్రాంతాల ప్రధాన రహదారులపై మావోయిస్టు పలు రకాల దృశ్చర్యలకు పాల్పడ్డారు. కొద్దిరోజుల క్రితం అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరించాలనే ప్రధాన లక్ష్యంతో పూసుగుప్ప వద్ధిపేట ప్రధాన రహదారి పై లారీ నీ దగ్ధం చేసి వారు ఉనికిని చాటారు.ఈ సంఘటన గడిచిన రెండు రోజుల వ్యవధిలోనే పేదిముసిలేరు పోలింగ్ కేంద్రానికి సమీప దూరంలో ప్రధాన రహదారి పై ఉన్న చీకటి వాగు వద్ద దాదాపు 40 కేజీల కంటెంనర్ లాండ్ వైరు బాంబు కలకరం రేపింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
చర్ల మండలంలో ఎన్నికల విధులకు హాజరైన భద్రత బలగాలపై దాడి చేయడానికి మావోయిస్ట్ లు పెద్దమీడిసీలేరు అటవీ ప్రాంత రహదారిలో సుమారుగా 40 కేజిల ప్రేలుడు పదార్దాన్ని (ల్యాండ్ మైన్) అమర్చారు.మావోయిస్టుల పన్నిన కుట్రను పసిగట్టిన పోలీసులు బాంబు స్క్వాడ్ ద్వారా అట్టి ల్యాండ్ మైన్ ను గుర్తించి ఈ రోజు ఉదయం నిర్వీర్యం చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ డా.వినీత్.జి ఐపిఎస్ ఒక ప్రకటను విడుదల చేశారు.నిషేధిత మావోయిస్టు పార్టీ వారి ఉనికిని చాటుకోవడానికి ఎన్ని అడ్డంకులు సృష్టించాలని చూసినా వాటిని పోలీసులు ధైర్యంగా ఎదుర్కోవడం జరిగిందన్నారు.ఎన్నికల విధులకు హాజరయ్యి తిరిగి వెళ్లే క్రమంలో భద్రతా బలగాలపై దాడికి యత్నించిన మావోయిస్టుల కుట్రను భగ్నం చేయడమైందన్నారు.చర్ల మండలంలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలలో నివసించే ప్రజలను మావోయిస్టులు బెదిరించి భయబ్రాంతులకు గురి చేసినా గాని ప్రభుత్వం,పోలీసులపై నమ్మకంతో ఓటింగ్ నకు హాజరై 90 శాతం పోలింగ్ జరిగేలా సహకరించిన ఏజెన్సీ ప్రజలకు ఎస్పీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసారు.ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికలు సజావుగా జరిగేందుకు సహకరించిన సి ఆర్ పి ఎఫ్ బలగాలకు కృతజ్ఞతలు తెలియజేసారు.