UPDATES  

 ప్రపంచ ఎయిడ్స్ అవగాహన ర్యాలీ..

 

మన్యం న్యూస్ ములకలపల్లి:

 

ప్రపంచ ఏయిడ్స్ నివారణ దినోత్సవంసందర్భంగా మండలం లోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రం మంగపేట సిబ్బంది,టిఎస్ఆర్టి బాలికల రెసిడెన్షియల్ కళాశాల నర్సింగ్ విద్యార్థులతో ప్రధాన రహదారిపై సరస్వతి విద్యాలయం నుండి ప్రధాన సెంటర్ మీదుగా సాయిబాబా గుడి వరకు సాగిన ఈ ర్యాలీ నిర్వహించారు.ఈ ర్యాలీ లో ఎయిడ్స్ నిర్మూలనకు సంబంధించిన స్లొగన్స్ తో ప్రధాన కూడలి వద్ద సిబ్బంది అందరూ వృత్తాకారంలో నిలబడి మానవహారం నిర్వహించి,ఎయిడ్స్ వ్యాధినిఅరికట్టడానికి తీసుకోవలసిన జాగ్రత్తల గురించి విషయాలు తెలియజేసారు.ఈ కార్యక్రమంలో సి హెచ్ వో భద్రమ్మ,సూపర్వైజర్స్ లు ఏ ఎన్ ఎం లు , ఆశా వర్కర్లు , నర్స్ ట్రైనింగ్ విద్యార్థులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !