మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల సమరం ముగిసింది. ఆయా పార్టీల అభ్యర్థుల జాతకాలు ఈవీఎం బాక్స్ లలో భద్రంగా ఉన్నాయి. ఓట్ల లెక్కింపు ద్వారా ఆదివారం అభ్యర్థుల జాతకాలు బయటపడనున్నాయి. ఎక్కడ చూసినా ఎన్నికల సమరం గురించి ఎవరు గెలుస్తారు అనేదానిపై ప్రధాన సెంటర్లలో జోరుగా చర్చ జరుగుతుంది. కొత్తగూడెం అసెంబ్లీ సెగ్మెంట్లో ప్రధానంగా మూడు పార్టీల మధ్యనే పోటీ నెలకొందని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. అయితే త్రిముఖ పోటీ ఉన్న ఇద్దరి మధ్య పోరా హోరి పోరు ఏర్పడిందని మరి కొంతమంది రాజకీయ సీనియర్ నాయకులు అంటున్నారు. భారత రాష్ట్ర సమితి నుండి వనమా వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్న సిపిఐ పార్టీ అభ్యర్థి కూనంనేని సాంబశివరావు, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరపున అభ్యర్థిగా జలగం వెంకట్రావు పోటీలో ఉండగా వీరిలో ఇద్దరి మధ్యనే రసవత్తర పోరు కొనసాగిందని పలువురు పేర్కొన్నారు. ఈ పోరులో ఓట్ల లెక్కింపుతో కూనంనేని లేదా జలగం వెంకటరావు గెలుపొందుతారని ఓటర్లు బహిరంగంగా చర్చించుకుంటున్నారు.
కొత్తగూడెంలో జరిగిన సైలెంట్ ఓటింగ్ వల్ల
అభ్యర్థుల గుండెల్లో దడ పుట్టిస్తుంది. ఓటర్ల నాడిని పట్టి చూస్తే ప్రధానంగా కాంగ్రెస్ బలపరిచిన సిపిఐ కూనంనేని ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ జలగం వెంకట్రావు పోటీ జరిగిందని స్పష్టంగా కనిపిస్తుందని రాజకీయ పరిశీలకులు
భావిస్తున్నారు. ఏది ఏమైనా కొత్తగూడెంలో మాత్రం ఓటర్ల నాడి పసిగట్టలేక పోతున్నారు. అయినప్పటికీ ఎవరికి వారే గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్నారు. సైలెంట్ గా జరిగిన ఓటర్ దేవుళ్ళ తీర్పు ఈనెల మూడో తేదీన విజేతను డిసైడ్ చేయనున్నది.