మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
పినపాక నియోజకవర్గానికి ఓట్ల లెక్కింపు పరిశీలకులుగా ఎన్నికల సంఘం నియమించిన కంటి శేఖర్ సింగ్ శనివారం ఐడిఓసి కార్యాలయానికి రావడం జరిగింది. ఈ సందర్భంగా శేఖర్ సింగ్ కు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల మొక్కను అందించి స్వాగతం పలికారు. అనంతరం జిల్లా ఎన్నికల అధికారి లెక్కింపు ప్రక్రియపై ఏర్పాట్లును శేఖర్ సింగ్ కు వివరించారు.