మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
ఎన్నికల కౌంటింగ్ వద్ద విధులు నిర్వర్తించే పోలీస్ అధికారులు సిబ్బంది ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని శనివారం సమావేశం ఏర్పాటు చేసి ఎస్పీ డాక్టర్ వినీత్ సూచనలు చేశారు. ఎవరైనా వ్యక్తులు కౌంటింగ్ సెంటర్ వద్దకు మద్యం సేవించి వస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలు, నాయకులు, వివిధ పార్టీల కార్యకర్తలు పోలీసు వారికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్నందున ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.