ములకలపల్లి మన్యం న్యూస్: డిశంబర్ 02. మండలం లోని పోలీస్ స్టేషన్ పరిధిలోగల ప్రజలకు,వివిధ పార్టీల కార్యకర్తలకు తెలియజేయునది,ఇటీవల అశ్వరావుపేట అసెంబ్లీ కి జరిగిన ఎన్నికలలో భాగంగా ఆదివారం ఉదయం నుండి ఎన్నికల లెక్కింపు కార్యక్రమం జరుగుతున్నది కావున, ఎటువంటి విజయోత్సవ ర్యాలీ, డీజేలు పెట్టి బైక్ ర్యాలీలు చేయడం, బాణాసంచాలు కాల్చడం, ప్రజలు ఒకే చోట గుమ్మిగూడటం, చట్టరీత్యా నేరం ఈనెల 5వ తేదీ వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున 144 సెక్షన్ అమల్లో ఉందని ప్రజలు వివిధ పార్టీ కార్యకర్తలు పోలీస్ శాఖ వారికి సహకరించవలసిందిగా తెలియజేసారు.మద్యం అమ్మకాలపై కూడా నిషేధం విధించడం జరిగిందని,
ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకూ ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్ట పరమైన కఠిన చర్యలు తీసుకొనబడునని స్థానిక ఎస్ ఐ సాయి కిషోర్ రెడ్డి తెలియజేసారు.