మన్యం న్యూస్ మణుగూరు:
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో నియోజకవర్గం లో 144సెక్షన్ అమలులో ఉంటుందని,మధ్యం విక్రయాలను నిషేదించి దుకాణాలన్ని మూసి ఉంచాలని మణుగూరు డీఎస్పీ రాఘవేంద్రరావు తెలిపారు.ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ, ఆదివారం ఉదయం 6గంటల నుండి సోమవారం ఉదయం 6గంటల వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందని,ప్రధాన సెంటర్లలో పోలీసుల పటిష్ట భద్రతను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.ప్రజలు ఎవరు కూడా గుంపులు గుంపులుగా సంచరించరాదని,బాణాసంచా పేల్చడం,ర్యాలీలు,చేయొద్దని సూచించారు.నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని,ఎలక్షన్ కోడ్ కు సంబంధించి కేసులు నమోదు చేస్తామని డీఎస్పీ రాఘవేంద్రరావు హెచ్చరించారు.ప్రజలు,పార్టీ నాయకులు అందరూ సహకరించాలి అని వారు విజ్ఞప్తి చేశారు.