మన్యం న్యూస్, మంగపేట.
ములుగు నియోజకవర్గం లో మాట తప్పని, మడమ తిప్పని దనసరి అనసూయ (సీతక్క) వనం లో ఉన్నా,జనం లో ఉన్నా అలుపెరుగనిపోరాటం చేస్తూ ప్రజల గుండెల్లో స్థానం సంపాదించారు. ములుగు నియోజకవర్గం లో బి ఆర్ ఎస్ అభ్యర్థి బడే నాగజ్యోతి మీద భారీ మెజారిటీ తో గెలుపొందారు. ఈ సందర్బంగా ములుగు నియోజకవర్గం లో నాయకులు, కార్యకర్తలు బాణా సంచా కాల్చి, మిఠాయిలు పంచుకున్నారు.మార్పు రావాలి అనే నినాధం తో ప్రజల మనసులో మార్పు తీసుకొని వచ్చి కాంగ్రెస్ రావాలి, కాంగ్రెస్ కావాలి అన్నట్లుగా కాంగ్రెస్ రాష్ట్ర వ్యాప్తంగా భారీ మెజారిటీ తో గెలిచి విజయోత్సవ సంబురాల్లో మునిగింది.