మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
ఈ నెల 27వ తేదీన కొత్తగూడెం రీజియన్ నందు గల కార్పొరేట్, కొత్తగూడెం, ఇల్లందు మణుగూరు ఏరియాలలో సింగరేణి గుర్తింపు యూనియన్ ఎన్నికల నిర్వహణ కొరకు చేయవలసిన ఏర్పాట్ల గురించి గురువారం సింగరేణి ప్రధాన కార్యాలయ జిఎం(పర్సనల్) వెల్ఫేర్ అండ్ ఆర్‌సి ఛాంబర్ నందు జిఎం(పర్సనల్) వెల్ఫేర్ అండ్ ఆర్‌సి కే.బసవయ్య లక్ష్మీదేవిపల్లి తహశీల్దార్ కేఆర్‌వికే. ప్రసాద్ తో చర్చించారు.
ఈ సంధర్భముగా జిఎం(పర్సనల్) కే.బసవయ్య లక్ష్మీదేవిపల్లి తహశీల్దార్ కేఆర్‌వికే.ప్రసాద్ తో కొత్తగూడెం రీజియన్ పరిధిలో యూనియన్ ఎన్నికలు సుజావుగా నిర్వహించేందుకు 24 పోలింగ్ బూతులు, 72 పోలింగ్ బాక్సులు అవసరమని తెలియజేశారు. అందుకు గాను ఎన్నికల నిర్వహణ కొరకు 124 మంది సిబ్బంది( ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు, పోలింగ్ ఆఫీసర్లు) ఓట్ల లెక్కింపు కొరకు 57 మంది సిబ్బందిని ( కౌంటింగ్ సుపర్వైజర్లు , కౌంటింగ్ అసిస్టెంట్ లు) కేటాయించమని కోరడం జరిగింది.
ఈ కార్యక్రమములో జిఎం(పర్సనల్) వెల్ఫేర్ ఆర్‌సి కే.బసవయ్యతో పాటు ఏజిఎం(పర్సనల్) కే.శ్రీనివాస రావు, లక్ష్మీదేవిపల్లి తహశీల్దార్ కేఆర్‌వికే. ప్రసాద్, డిజిఎం(పర్సనల్) లు పి.వేణుగోపాల్ రావు, వైవిఎల్ వరప్రసాద్, డిజిఎం(ఐటి) హరిశంకర్, సీనియర్ పిఓ జికే.కిరణ్ కుమార్ లు పాల్గొన్నారు.