ప్రయాణికుల ఇబ్బందులు తగ్గించేందుకు ఢిల్లీ ప్రభుత్వం ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇకపై వాట్సాప్ ద్వారా బస్ టికెట్లు జారీ చేసే దిశగా చర్యలు తీసుకుంటోంది. ఈ తరహా సేవలను ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్ అందిస్తోంది. దీనిపై ప్రయాణికుల నుంచి మంది ఆదరణ లభిస్తోంది. దాంతో బస్సుల్లోనూ ఈ సేవలు ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తోంది