మానవ మేథస్సుతో పోటీపడే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందరినీ ఆకట్టుకున్నది. మొన్నటి వరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను స్వాగతించిన యావత్ ప్రపంచం.. తాజాగా జరుగుతున్న ఘటనలతో ఆందోళనలు వ్యక్తమవుతున్నది. ఈ క్రమంలో యూరోపియన్ యూనియన్ ఏఐకి వ్యతిరేకంగా చట్టం తీసుకువచ్చేందుకు సిద్ధమైందని ఓ నివేదిక పేర్కొంది. అందుబాటులోకి వస్తే తొలి చట్టంగా నిలువనున్నది.