UPDATES  

 రెండు రూపాయలకే తిన్నంత బిర్యానీ…

అప్పుడప్పుడూ మనం వింత ఆఫర్ల గురించి వింటూ ఉంటాం. ఉచిత బిర్యానీ, పది రూపాలకే బిర్యానీ, ఆ షాపింగ్ మాల్‌లో ఇది ఉచితం.. ఆ కంపెనీలో ఉద్యోగలుకు ఇది ఫ్రీ అని. అలాంటిదే ఒకటి వింత ఆఫర్ హైదరాబాద్‌లో ఒక రెస్టారెంట్‌లో నడుస్తోంది. అదే కేవలం రూ.2 లకే తిన్నంత బిర్యానీ. ఆశ్చర్యపోనక్కర్లేదు.. ఇది నిజమే! కానీ ఈ బిర్యానీ తినాలంటే ఒక కండిషన్ విధించారు ఆ రెస్టారెంట్ ఓనర్.

 

హైదరాబాద్ నగరంలోని కేపీహెచ్‌బీ, దిల్‌సుఖ్‌నగర్‌, గచ్చిబౌలి ప్రాంతాలలో బ్రాంచీలు ఉన్న నాయుడు గారి కుండ బిర్యానీ అనే రెస్టారెంట్ ఉంది. అందులో కేవలం రూ.2 లకే తిన్నంత బిర్యానీ ఆఫర్ పెట్టారు. అయితే ఈ ఆఫర్ బిర్యానీ తినాలంటే ఒక కండిషన్ ఉంది. అదే రూ.2లు. మామూలుగా అందరూ అనుకున్నట్లు రూ.2 అంటే చిల్లర కాదు. రూ.2 నోటు తీసుకొని వస్తే.. ఆ రెస్టారెంట్‌లో కడుపునిండా బిర్యానీ తినొచ్చు.

 

కానీ ఈ కాలంలో రూ.2 నోటు దొరకడం చాలా అరుదు. అందుకే ఈ ఆఫర్‌ని వినియోగించుకున్న వాళ్లు చాలా తక్కువ. కేవలం 120 మంది మాత్రమే పాత రూ.2 నోటు తీసుకు వచ్చి బిర్యానీ ఆరగించారు. రెస్టారెంట్ ఓనర్ సమాజంలో పాత రూ.2 నోట్ల ఇంకా ఎంత మంది వద్ద ఉన్నాయో తెలుసుకునేందుకు ఈ ఆఫర్ ప్రకటించారని తెలుస్తోంది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !