ఖలిస్తాన్ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్ను (Gurpatwant Singh Pannun) ఇటీవలే ఒక వీడియా ద్వారా భారతదేశ పార్లమెంట్‌పై 13 డిసెంబర్ లేదా అంతకుముందే దాడి చేస్తానని బెదిరించాడు. అయిగే సరిగ్గా బుధవారం డిసెంబర్ 13 రోజే పార్లమెంటులో ఇద్దరు దుండగులు ప్రవేశించి కలకలం సృష్టించారు. ఆ ఇద్దరినీ భద్రతా దళాలు అరెస్టు చేశాయి.
22 ఏళ్ల క్రితం 2001 డిసెంబర్ 13న ఇలాగే కొందరు ఉగ్రవాదులు పార్లమెంటుపై దాడి చేశారు. అప్పుడు ఆ దాడిలో 9 మంది చనిపోయారు. ఇప్పుడు కూడా సరిగ్గా పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరుగుతున్న సమయంలో ఈ దాడులు జరిగాయి. ఈ ఇద్దరు దుండగులు దాడి చేసేందుకు ప్రయత్నించినప్పుడు పశ్చిమ బెంగాల్ బిజేపీ ఎంపీ ఖగేన్ ముర్ము లోక్ సభలో ఒక ప్రశ్నకు సమాధానం చెబుతున్నారు. అదే సమయంలో సందర్శకులు కూర్చునే ప్రాంతం నుంచి ఓ దుండగుడు కిందికి దూకి గ్యాస్ స్ప్రే చేశాడు.
ఈ ఘటనలో లోక్ సభలోని ఎంపీలు ధైర్యంగా ఆ ఇద్దరు దుండగులను పట్టుకుని భద్రతా దళాలకు అప్పగించారు. ఇద్దరు దుండగులలో ఒకరు యువకుడు కాగా, మరొకరు ఒక మహిళ. యువకుడి పేరు అమోల్ షిండే వయసు 25, మహారాష్ట్ర లాతూర్ నగరానికి చెందినవాడు. మహిళ పేరు నీలం పుత్రి కౌర్ సింగ్ వయసు 42, హర్యాణా రాష్ర్టంలోని హిసార్ నగరంలో నివసిస్తోందని తెలిసింది.
ఉగ్రవాది పన్ను అమెరికా, కెనెడా పౌరుడు.. భారతదేశంలో నుంచి పంజాబ్, హర్యానా రాష్ట్రాన్ని కలిపి సిక్కుల కోసం ప్రత్యేక ఖలిస్తాన్ దేశంగా ఏర్పాటు చేయాలని అతని డిమాండ్. పన్నుతో పాటు చాలామంది ఖలిస్తాన్ ఉగ్రవాదులు గ్రూపులుగా ఏర్పడి పాకిస్తాన్, అమెరికా, కెనెడా, ఆఫ్రికా దేశాల నుంచి భారత్ వ్యతిరేక ఎజెండాతో రహస్యంగా పనిచేస్తున్నారు. ఇటీవలే కెనెడాలో ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ గుజ్జర్ హత్య చేయబడ్డాడు. మరి కొన్ని రోజులకే అమెరికాలో పన్నుపై కూడా హత్యాయత్నం జరిగింది. కానీ పన్ను తప్పించుకున్నాడు.
ఈ హత్యలు భారతదేశం చేయిస్తోందని అమెరికా కోర్టులో పన్ను కేసు వేశాడు. ఆ తరువాత ఒక వీడియో ద్వారా భారత ప్రభుత్వానికి బెదిరించాడు. 2001 డిసెంబర్ 13న పాకిస్తాన్ ఉగ్రవాది అఫ్జల్ గురు ఎలాగైతే పార్లమెంటుపై దాడి చేయించాడో.. అలాగే మరో దాడి డిసెంబర్ 13 2023న కూడా జరగబోతోందని ఆ వీడియోలో బెదిరింపు స్వరంతో చెప్పాడు. ఇప్పుడు పార్లమెంటు లోపల ఇద్దరు దుండగులు చేసిన దాడి వెనుక ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్ను హస్తం ఉన్నదా.. అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అమెరికా, కెనెడాలో ఉంటూ పన్ను ఈ భారతదేశానికి హాని కలిగించే విధంగా ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్నాడు. దీనిపై భారత్ ఎన్నిసార్లు అమెరికా ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినా.. అక్కడి అధికారుల నుంచి సరైన స్పందన రావడం లేదు. పైగా భారత గూఢాచారులు.. తమ గడ్డపై ఒక అమెరికా పౌరుడిని హత్య చేసేందుకు ప్రయత్నించడం నేరమంటూ ఎదురు బెబుతున్నారు. కెనెడా ప్రభుత్వం కూడా తమ దేశంలో నివసిస్తున్న సిక్కు పౌరులకు ప్రాధాన్యమిస్తూ.. కొన్ని నెలల క్రితం భారత ప్రభుత్వ తీరును తప్పుబట్టింది.
అమెరికా, కెనెడా, ఆస్ట్రేలియా, బ్రిటన్, ఫ్రాన్స్, న్యూజిలాండ్ లాంటి దేశాలు తమ భూమిపై ఎవరైనా ఉగ్రవాద చర్యలకు పాల్పడితే.. ప్రపంచంలోని ఏ దేశంలో ఆ ఉగ్రవాదులను వెతుకుతూవారు దాకున్నా వారిని టార్గెట్ చేసి మరీ చంపుతాయి. ఇదంతా తమ పౌరుల సంరక్షణ కోసం, దేశ హితం కోసం, ఉగ్రవాదులను శిక్షించడం కోసం అని నీతులు చెబుతాయి. అతెందుకు తాజాగా నవంబర్‌లో పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ ఇజ్రయేల్‌పై దాడి చేస్తే.. దానికి ప్రతీకార చర్యగా ఇజ్రాయేల్ గాజాలో భీభత్సం సృషింస్తోంది. ఇజ్రాయేల్ దాడులలో అమాయక ప్రజలు, చిన్న పిల్లలు, మహిళలు భారీ సంఖ్యలో చనిపోతున్నారు. అయినా ఇజ్రాయేల్ పక్కా దోస్త్ అమెరికా మాత్రం ఇదంతా న్యాయమే అని ఇజ్రాయేల్‌ని సమర్థిస్తోంది. హమాస్ ఉగ్రవాదులను వదలకూడదని ఇజ్రాయేల్‌కు అన్ని విధాలుగా సహాయం చేస్తోంది.
మరి అదే భారతదేశంలో ఉగ్రదాడులుకు కారణమైన పన్నుని మాత్రం తమ దేశ పౌరుడు కాబట్టి అతని మీద ఈగ కూడా వాలకూడదు అని భారత ప్రభుత్వానికి చెబుతోంది. అమెరికా, పాశ్చాత్య దేశాల చరిత్ర చూస్తే వారిది ఎప్పుడూ ఇదే ధోరణి.. తమ పౌరుల ప్రాణాలైతే ఒక లెక్క.. అదే భారత్ లాంటి ఆసియా దేశాల పౌరుల ప్రాణాలైతే అసలు అది ఒక లెక్కే కాదు అని తీసిపారేస్తారు. దీనికి ఎన్నో ఉదాహరణలు.