UPDATES  

 నైజాంలో సలార్ టికెట్ల పెంపు ..

ప్రభాస్ నటించిన మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా భారీ యాక్షన్ మూవీ సలార్. ఈ చిత్రం విడుదల కి గట్టిగా 10 రోజుల సమయం కూడా లేదు. అయినా కానీ ప్రమోషన్స్ ఆశించిన స్థాయిలో జరగడం లేదని ప్రభాస్ అభిమానులు నిరాశ చెందుతున్నారు. అయితే మరోపక్క మూవీ పై హైప్ కూడా ఓ రేంజ్ లోనే ఉంది. ఎటువంటి భారీ ప్రమోషన్స్ లేకుండానే ఇంత బజ్ నెలకొని ఉంటే.. బాగా ప్రమోషన్స్ చేస్తే మరింత టాక్ ఉంటుంది అని కొందరు భావిస్తున్నారు. ఇటు చూస్తే ప్రశాంత్ నీల్ అండ్ టీమ్.. మూవీకి భారీ ఓపెనింగ్స్ కన్ఫామ్ అని కాన్ఫిడెంట్ గా ఉన్నారు.

 

ఈ నేపథ్యంలో రాబోయే పది రోజుల్లో ప్రమోషన్స్ ని భారీగా నిర్వహిస్తామని మేకర్స్ చెబుతున్నారు.. అయినా ఈ విషయంపై నమ్మకం లేదు అని తేల్చి చెబుతున్నారు ప్రభాస్ అభిమానులు .ఇక ఆ విషయం అటువంటి ప్రస్తుతానికి ఈ మూవీకి సంబంధించి మరొక లేటెస్ట్ గాసిప్ వైరల్ అవుతుంది. రాజమౌళి వరల్డ్ వైడ్ సెన్సేషన్ ఆర్ఆర్ఆర్ తో సమానంగా ప్రభాస్ సలార్ మూవీ టికెట్ల ధర పెంచే విధంగా చిత్ర బృందం ప్రయత్నాలు చేస్తోంది అని టాక్. ఇప్పటికే నైజాంలో స్పెషల్ షోల కోసం.. టికెట్ల ధర పెంపు కోసం.. ఈ మేరకు చిత్ర బృందం దరఖాస్తు కూడా చేసింది. మొత్తానికి ఆర్ఆర్ఆర్ ధరలకు దగ్గరలో సలార్ మూవీ టికెట్ల ద్వారా ఉండవచ్చు అని తెలుస్తోంది.

 

ఆ లెక్క ప్రకారం తీసుకుంటే మల్టీప్లెక్స్లలకు.. జీఎస్టీ తో కలుపుకొని సుమారు 413 రూపాయల వరకు ఉంటుంది. అలాగే సింగిల్ స్క్రీన్ కు సుమారు 236 రూపాయల వరకు సింగిల్ టికెట్ ధర ఉండొచ్చు. అయితే ఈ పెంపు కేవలం మొదటి వారం వరకు వర్తిస్తుంది. మొదటి వారాంతరం తర్వాత.. జీఎస్టీ తో సహా టికెట్ ధరలు మల్టీప్లెక్స్ కు 354 ఉండగా.. సింగిల్ స్క్రీన్ కు సుమారు 230 రూపాయలు ఉండొచ్చు. ఈ మేరకు కొత్త ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తూ ధరఖాస్తు ని కూడా చిత్ర బృందం దాఖలు చేసుకుంది. మరి ప్రభుత్వం నుంచి ఈ విషయంపై మేకర్స్ కు గ్రీన్ సిగ్నల్ వస్తుందో లేదో చూడాలి.

 

ప్రస్తుతానికి గవర్నమెంట్ ప్రకారం థియేటర్లకు ఆమోదించిన ధరల విషయానికి వస్తే.. మల్టీప్లెక్స్ 295 రూపాయలు కాగా సింగిల్ స్క్రీన్ 175 రూపాయలు ఉంది. ధరల పెంపు జరిగితే సామాన్యుడిపై పెను భారం పడే అవకాశం ఉంది.. మరి ఈ నేపథ్యంలో మొదటి రోజు మూవీ టాక్ కాస్త తేడా పలికిన చిత్రం కలెక్షన్స్ పై భారీ ప్రభావం కూడా ఛాన్స్ ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !