మద్యం ప్రియుల కోసం ప్రముఖ కూల్ డ్రింక్స్ కంపెనీ కోకా కోలా ఒక శుభవార్త ప్రకటించింది. భారతదేశంలో మొట్టమొదటిసారిగా మద్యం మార్కెట్‌లో తమ కొత్త ప్రాడక్ట్ లాంచ్ చేసింది. కోకా కోలా తన ప్రముఖ లికర్ బ్రాండ్ లెమన్ డౌ (Lemon Dou)ని ఇండియాలో పంపిణీ చేస్తున్నట్లు ప్రకటించగానే దేశమంతా దీని గురించే చర్చ మొదలైంది.
తాజాగా కోకా కోలా కంపెనీ లెమన్ డౌ లికర్‌ని పైలట్ ప్రాజెక్ట్‌గా మహారాష్ట్ర, గోవాలో విడుదల చేసింది. ఈ రెండు రాష్ట్రాల్లో స్పందన బట్టి ఆ తరువాత దేశమంతా లెమన్ డౌ బ్రాండ్‌ని విడుదల చేస్తుందని తెలిపింది. గోవాలో ఒక లెమన్ డౌ 250ml క్యాన్ ధర రూ.150 అదే మహారాష్ట్రలో రూ.230.
ఈ లెమన్ డౌ లికర్‌ను 2018లోనే కోకా కోలా కంపెనీ జపాన్‌లో మొదటిసారి విడుదల చేయగా.. ఆ తరువాత క్రమంగా ఫిలిప్పీన్స్, చైనా దేశాలకు విస్తరించింది. ఇండియాలో మరో 5 ఏళ్లలో మద్యం మార్కెట్ 64 బిలియన్ డాలర్లకు పెరుగనుందని అంచనా. దీంతో కోకా కోలా భారత మార్కెట్‌పై దృష్టి పెట్టింది.