కేసీఆర్ కి పనితనం తప్ప.. పగతనం తెలియదని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ‘కాంగ్రెస్ వాళ్లు గ్లోబెల్స్ ప్రచారం చేసి అధికారంలోకి వచ్చారు.. నిజం గడప దాటే లోపు అబద్ధం ఊరంతా తిరిగివచ్చినట్టు అయ్యింది.. నిజంగా కేసీఆర్ అనుకుంటే సగం మంది కాంగ్రెస్ నాయకులు జైల్లో ఉండేవారు.. హౌసింగ్ స్కాములపై సీఐడీ విచారణ చేస్తే పెద్ద రిపోర్ట్ వచ్చింది.’ అని వ్యాఖ్యానించారు.
