డిసెంబర్ 25న అయోధ్యలోని శ్రీరామ్ అంతర్జాతీయ విమానశ్రయం ప్రారంభం కానుంది. ఆ రోజు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి జన్మదినం సందర్భంగా అయోధ్యలోని శ్రీరామ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు.అయోధ్య శ్రీరామ దేవాలయం ప్రాణ ప్రతిష్ట వేడుకకు ముందు అక్కడ అంతర్జాతీయ విమానాశ్రయ సేవలు ప్రారంభం కానున్నాయి. అయోద్య రామమందిరం ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జనవరి 2024లో జరగనుంది. ఈ సందర్భంగా డిసెంబర్ 12.2023 అంటే నిన్నటి రోజున కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, కేంద్ర మంత్రి వీకే సింగ్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నిన్న అయోధ్య విమానాశ్రయ నిర్మాణాన్ని పరిశీలించడం జరిగింది. అనంతరం శ్రీరామ్ అంతర్జాతీయ విమానశ్రయ పనులను ఈ నెల 15 లోగా పూర్తిచేయాలని అన్నారు.
ఒకవైపు విమానాశ్రయ పనులు ఎంతో వేగంగా పూర్తవుతున్నాయి. డిసెంబర్ 25, 2023 నాటికి మొదటి దశ పనులన్నీ పూర్తి చేసి విమానాల రాకపోకలను ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ విమానశ్రయం పనులను మూడు దశల్లో నిర్వహించనున్నారు. దీని కోసం ఈ ప్రాజెక్టులో భాగంగా మొత్తం 821 ఎకరాల భూమిని సేకరించి ఎయిర్‌పోర్ట్ అథారిటీకి అప్పగింంచడం జరిగింది. ఎయిర్‌పోర్ట్ మొదటి దశలో 2200 మీటర్ల పొడవు, 45 మీటర్ల వెడల్పుతో రన్‌వే పనులను పూర్తి చేయడం జరిగింది. అయితే, భవిష్యత్తులో ఈ రన్‌వేను 3750 మీటర్లకు విస్తరించే ఆలోచనలో అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. అందుకోసం ఇప్పటికే భూమిని కూడా సేకరించడం జరిగింది.
అయోధ్య ధామ్ విమానశ్రయంలో ఎయిర్‌బస్ సౌకర్యం : వీటితోపాటు పొగమంచు, రాత్రిపూట ల్యాండింగ్ చేసేందుకు వీలుగా CAT-1, RESA వంటి పనులను కూడా పూర్తిచేశారు. విమానం ల్యాండింగ్ కోసం ఏర్పాటు చేసిన లైటింగ్ పనులు కూడా ఇప్పటికే పూర్తవ్వడం జరిగింది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్ పనులు కూడా పూర్తి అయిపోయాయి. అగ్నిమాపక దళం వాహానాలు కూడా ఎయిర్‌పోర్ట్‌కు ఎయిర్‌పోర్టుకు చేరుకున్నాయి. ఆపరేషన్ కోసం లైసెన్సింగ్ ప్రక్రియ చివరి దశలో ఉన్నట్లు సమాచారం. ఇక ఈ శ్రీరామ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభమైన అనంతరం, అయోధ్య ధామ్ విమానాశ్రయంలో ఎయిర్‌బస్ A320 వంటి విమానాలను ల్యాండింగ్ చేసే సౌకర్యం అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది.