ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్) తమ భారతీయ మీడియా కార్యకలాపాలను విలీనం చేయడానికి వాల్ట్ డిస్నీ తో చర్చలు జరుపుతోందని ది ఎకనామిక్ టైమ్స్ పేర్కొంది. రిలయన్స్ వయాకామ్ 18 కొత్తగా ఏర్పడిన యూనిట్ డిస్నీ స్టార్ ఇండియాతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇరు సంస్థలు విలీనం అయితే అందులో రిలయన్స్ కు 51% వాటా , డిస్నీకి 49% వాటా ఉండవచ్చని భావిస్తున్నారు.
వాటా కోసం రిలయన్స్ నగదు జమ చేసే అవకాశం ఉంది. కొద్ది నెలల క్రితం డిస్నీ హాట్ స్టార్ తన ఇండియా ఆస్తులను అమ్మాలని భావిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఇందుకు బిలియనీర్లు గౌతమ్ అదానీ మరియు సన్ టీవీ నెట్‌వర్క్ యజమాని కళానిధి మారన్‌తో పాటు ప్రైవేట్ ఈక్విటీ సంస్థ బ్లాక్‌స్టోన్‌తో చర్చలు జరిపింది. ఫైనల్ గా డిస్నీ ఇప్పుడు వ్యాపారంలో నియంత్రణ వాటాను రిలయన్స్‌కు విక్రయించవచ్చు.
రిలయన్స్, దీని ప్రసార వెంచర్ వయాకామ్ 18 నడుపుతున్న జియోసినిమా డిస్నీ ఇండియా, ఇతర స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లపై ఒత్తిడి పెంచింది. అంబానీ ఐపీఎల్ క్రికెట్ టోర్నమెంట్‌ను ఇచితంగా స్ట్రీమింగ్ చేసింది. దీంతో డస్నీ కూడా క్రికెట్ వరల్డ్ కప్ ఫ్రీగా స్ట్రీమే చేయాల్సి వచ్చింది. IPL స్ట్రీమింగ్ హక్కులను కోల్పోయిన తర్వాత డిస్నీ స్టార్ సబ్‌స్క్రైబర్ సంఖ్య భారీగా తగ్గింది.
రిలయన్స్ మద్దతుతో కూడిన స్ట్రీమింగ్ సర్వీస్ అయిన జియోసినిమా, ప్లాట్‌ఫారమ్‌పై ఉచితంగా వీక్షించే ఐపిఎల్ ఫైనల్ కోసం మేలో రికార్డు స్థాయిలో 32 మిలియన్ల మంది ఏకకాల వీక్షకులను సంపాదించింది. వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ ఇంక్ ప్రత్యేకమైన కంటెంట్‌ను భారతదేశంలో ప్రసారం చేయడానికి బహుళ-సంవత్సరాల ఒప్పందంపై సంతకం చేసింది. దీంతో డిస్నీ హాట్ స్టార్ పై ఒత్తిడి పెరగడంతో తన ఇండియా ఆస్తులను విక్రయించడానికి సిద్ధమైంది.