జూనియర్ ఎన్‌టిఆర్ హీరోగా తెరకెక్కుతున్న దేవర సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. అయితే, ఈ సినిమా గురించి ఇంకా ఎటువంటి అప్‌డేట్ రాకపోవడంతో అభిమానులు కాస్త నిరాశకు గురవుతున్నారు. తాజాగా, ఈ సినిమా గురించి నందమూరి కళ్యాణ్ రామ్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్‌మీడియాను ఓ ఊపు ఊపేస్తున్నాయి. నటుడు కళ్యాణ్ రామ్ తాజా మూవీ డెవిల్. ఈ సినిమా ట్యాగ్‌లైన్ ది బ్రిటిష్ సీక్రెంట్ ఏజెంట్. ఈ సినిమా డిసెంబర్ 29 న తెరపైకి రానుంది. ఈ సినిమా టైలర్‌ను మూవీ మేకర్స్ తాజాగా విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి వచ్చిన కళ్యాణ్‌రామ్ దేవర సినిమా కొన్ని ఆసక్తకిర కామెంట్స్ చేశారు.
దేవర సినిమాకు కళ్యాణ్‌రామ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. అందుకే ఈ కార్యక్రమంలో కళ్యాణ్‌రామ్ మాట్లాడుతుంటే అభిమానులు దేవర సినిమా గురించి అడిగారు. దాంతో కళ్యాణ్‌రామ్ ఈ సినిమా గురించి అప్‌డేట్ ఇచ్చారు. తమ్ముడి సినిమా దేవర కోసం చాలా జాగ్రత్తగా కష్టపడుతున్నాము. త్వరలో గ్లింప్స్ రాబోతుంది. ఈ సినిమాకు సంబంధించిన పనులు కూడా ఎంతో శరవేగంగా సాగుతున్నాయి. ఈ సినిమాతో మీకు ఓ కొత్త ప్రపంచాన్ని పరిచయం చేయబోతున్నాం. అందుకోసం కాస్త సమయం పడుతుంది. దయచేసి ఓపిక పట్టండి. త్వరలోనే ఈ సినిమా డేట్ కూడా అనౌన్స్ చేస్తాం అంటూ దేవర టీజర్ గురించి కళ్యాణ్ రామ్ చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించిన వీడియో కాస్త నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.
రెండు భాగాలుగా తెరకెక్కనున్న సినిమా : పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న దేవర సినిమాలో అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీకపూర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సైఫ్ ఆలీఖాన్ కూడా ఓ కీలకమైన పాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కూడా బహుబలి తరహాలో రెండు పార్టులుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. దేవర పార్ట్1ను ఏప్రిల్ 5న థియేటర్లలోకి తీసుకురానున్నట్లు సమాచారం. ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న విషయం అందరికీ తెలిసిందే.