ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘సలార్’. యాక్షన్ థ్రిల్లర్ జోనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం రెండు పార్టులుగా రాబోతుంది. డిసెంబర్ 22న సలార్ పార్ట్-1 విడుదల కాబోతుంది. సినీ ప్రమోషన్స్‌లో మేకర్స్ బిజీగా ఉన్నారు. అయితే ప్రమోషన్స్‌లో నిర్మాత విజయ్ కిరగందూర్‌కు హీరో యశ్ గెస్ట్ రోల్ గురించి ప్రశ్నించారు. కేజీఎఫ్, సలార్‌కు సంబంధం ఉండదని, యశ్ గెస్ట్ రోల్‌లో కనిపించడని అన్నారు.
